విద్యాబుద్ధులు నేర్పే దేవతను అమ్మగా భూమి మీద దేవుడు సృష్టించాడని నమ్ముతారు.అలాంటి తల్లిపై ఓ కుమారుడు తన భార్యతో కలిసి దాడి చేసి గాయ పరిచాడు.
తాజాగా ఈ ఘటన తెలంగాణలోని సీతారాంపూర్ లో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే నల్లెల సూరయ్యకు,సుశీలకు ముగ్గురు సంతానం.వారికి ఉన్న 7.28 ఎకరాల భూమిలో ఒక ఎకరం కూతురికి .మరో ఎకరం సుశీలకు రాసి మిగిలిన భూమిని ఇద్దరు పుత్రులకు సమానంగా పంచుకోవాల్సిందిగా సూచించారు.కాని ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెద్ద కుమారుడు నల్లెల రవీందర్ ఆ భూమిలో ఎక్కువ వాటాను తీసుకున్నాడు.
దీంతో చిన్న కుమారుడైన శ్రీధర్ తనకు రావాల్సిన మిగతా వాటాను ఇవ్వాల్సిందిగా అన్నతో పోరాడుతున్నాడు.
ఈ విషయంలో సుశీల తన చిన్న కుమారుడికి అండగా నిలిచింది.
దీంతో రవీందర్ తన భార్యతో కలిసి పత్తి చేను వద్ద పనిచేస్తున్న తల్లిపై దాడి చేశాడు.ఈ సమయంలో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న శ్రీధర్ వెంటనే తల్లిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు.ఆస్తి కోసం ఇంతటి దారుణానికి వడిగట్టిన అన్నయ్య పై ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.