జనసేన బలం పై టీడీపీ టెన్షన్ ? 

ఏపీలో జనసేన రాజకీయ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి.రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు పవన్ గట్టిగానే కృషి చేస్తున్నారు .

 Tdp Tension On Janasena Strength , Pavan Kalyan, Telugudesam, Tdp, Chandrababu,-TeluguStop.com

గతంలో మాదిరిగా కాకుండా 2024 ఎన్నికల్లో జనసేన ప్రభావం పెరిగేలా చేసుకునేందుకు పార్టీ క్యాడర్ తో పాటు,  జనాల్లోనూ జనసేన పై మరింత ఆసక్తి పెరిగే విధంగాను పవన్ ముందడుగు వేస్తున్నారు.దీనిలో భాగంగానే వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విషయంపైనే పవన్ దృష్టి సారించారు .ఏపీ అంతట జనసేన ప్రభావం ఉండకపోయినా, కోస్తా ఆంధ్ర , ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని,  వీలైనన్ని ఎక్కువ సీట్లు 2024 ఎన్నికల్లో దక్కుతాయనే అంచనా తో పవన్ ఉన్నారు.అందుకే ఇక్కడ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు .
   2019 ఎన్నికల్లోను జనసేనకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓటింగ్ శాతం బాగానే వచ్చింది.అక్కడ అభ్యర్థులంతా ఓటమి చెందినా, జనసేన ప్రభావం బాగా కనిపించింది.అందుకే అక్కడ మరింతగా కష్టపడితే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు దక్కించుకోవచ్చనే లెక్కల్లో పవన్ ఉన్నారు.అన్ని పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రాంతం లో వచ్చే సీట్లు కేలకం కావడం తో,  పవన్ ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .2019 ఎన్నికల్లో 33 స్థానాలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ 28 చోట్ల గెలిచింది.అయితే ఈసారి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా జనసేన ఖాతాలో ఆ సీట్లు పడేవిధంగా పవన్ ప్లాన్ చేస్తున్నారు.వీటితో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనూ తమకు ఆశించని స్థాయిలోనే స్థానాలు దక్కుతాయని పవన్ అంచనా వేస్తున్నారు.
 

Telugu Ap, Chandrababu, Jagan, Pavan Kalyan, Tdp, Telugudesam, Ysrcp-Political

 ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అనేక సభలు నిర్వహించారు .అలాగే యువశక్తి పేరుతో సభలను శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి పవన్ ప్రారంభించబోతున్నారు.ఈ విధంగా ఈ ప్రాంతం నుంచి జనసేన కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారా ,  రాబోయే ఎన్నికల్లో తమ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పవన్ భావిస్తున్నారు.ఇది ఇలా ఉంటే జనసేన ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడం,  రాబోయే ఎన్నికల్లో కీలకం కాబోతుండడంతో,  టిడిపి ఆందోళన చెందుతోంది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి ప్రజాప్రతినిధులు జనసేన వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడం, రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసేందుకు టిడిపికి చెందిన వారే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉండడం వంటి విషయాలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయట.దీంతో జనసేన బలం పెంచుకునే కొద్ది తమ ప్రభావం తగ్గుతుందనే టెన్షన్ బాబులో స్పష్టంగా కనిపిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube