వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీ ఎంపీ కేశినేని నాని పొగిడారు.వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పనితీరు బాగుందని కేశినేని ప్రశంసించారు.
ఎమ్మెల్యే చేస్తున్న కృషిని గత నాలుగేళ్లుగా తాను చూస్తున్నట్లు కేశినేని తెలిపారు.ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెంటనే స్పందిస్తారని చెప్పారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి తాను సహకరిస్తానని స్పష్టం చేశారు.అభివృద్ది కోసం ఎంపీ నిధులు కేటాయిస్తానని వెల్లడించారు.
రాజకీయాలు ఎలక్షన్ వరకే పరిమితమైతే బాగుంటుందని పేర్కొన్నారు.పార్టీలు వేరైనా ప్రాంతం అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
కాగా నందిగామ నియోజకవర్గంలో కేశినేని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.