బాబు అరెస్ట్ ఎన్టీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారిందిగా... ట్రోల్ చేస్తున్న తమ్ముళ్లు!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా సిఐడి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేస్తున్నారు.

 Tdp Leaders Demands Ntr Respond On Chandrababu Naidu Arrest , Ntr, Nara Bhuvane-TeluguStop.com

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నేతలు పార్టీ కార్యకర్తలు కూడా ఈ అరెస్టుకు నిరసన తెలియజేస్తున్నారు.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎన్టీఆర్( NTR) స్పందించకపోవడం గమనార్హం.

Telugu Chandrababu, Bhuvaneshwari, Tdp-Movie

చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడంతో ఇప్పటికే నందమూరి హీరోలు కూడా స్పందించారు కానీ ఎన్టీఆర్ మాత్రం స్పందించకపోవడంతో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.తమ పార్టీ అధినేతను అరెస్టు చేస్తే ఎన్టీఆర్ ఇప్పటివరకు మౌనం వహిస్తున్నారని, ఈ అరెస్టును తాను ఖండించాలి అంటూ డిమాండ్ చేశారు.మరికొందరు అవసరానికి నందమూరి కుటుంబ సభ్యుడిని అని చెప్పుకొని ఎన్టీఆర్ ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండరు అంటూ కూడా ఎన్టీఆర్ పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Telugu Chandrababu, Bhuvaneshwari, Tdp-Movie

చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త ఎన్టీఆర్ కి తలనొప్పి గానే మారిందని చెప్పాలి.గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేశారు.ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా ఈయన ఘాటుగా స్పందించలేదంటూ ఈయనపై విమర్శలు కురిపించారు అలాగే వైసిపి నేతలు నారా భువనేశ్వరుని( Nara Bhuvaneshwari ) అసభ్యంగా మాట్లాడటంతో అప్పుడు కూడా ఎన్టీఆర్ తీవ్రంగా ఖండించలేదు అంటూ ఈయన పట్ల విమర్శలు కురిపించారు.

తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఎన్టీఆర్ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇప్పటికైనా ఈ విషయంపై తారక్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube