ఈ నెల 4వ తేదీన టీడీఎల్పీ సమావేశం( TDLP Meeting ) జరగనుంది.టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu ) సభ్యుల అభిప్రాయాలను తీసుకోనున్నారు.
దాంతోపాటుగా రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లు, గంటా శ్రీనివాస్ రావు రాజీనామా( Ganta Srinivasa Rao Resign ) ఆమోదంతో పాటు స్పీకర్ వ్యవహార శైలి వంటి పలు అంశాలపై టీడీఎల్పీలో ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై సభలో నిరసన తెలిపే విధంగా టీడీఎల్పీ ప్రణాళికలు సిద్ధం చేయనుందని సమాచారం.