మా కుటుంబం మొత్తానికి బాణామతి చేశారు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలలోని ప్రముఖ విలన్లలో టార్జాన్ లక్ష్మీనారాయణ ఒకరు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీనారాయణ సినిమా ఇండస్ట్రీలో లక్ ఉండాలని నటుడిగా మంచి సినిమాలు సినిమాలు చేశానని తనను ఇప్పటికే చాలామంది గుర్తుపడతారని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

 Tarzan Laxminarayana Shocking Comments In An Interview Details, Banamathi, Tarza-TeluguStop.com

తనకు వచ్చిన సినిమా ఆఫర్ల విషయంలో సంతోషంగా ఉన్నానని లక్ష్మీనారాయణ అన్నారు.మా బ్రదర్స్ వ్యాపారం చేస్తారని అందువల్ల తాను కూడా వ్యాపారంలోకి వెళ్లానని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

నాన్న సర్పంచ్ అని మా అన్నయ్యకు, నాకు బాణామతి చేశారని అందువల్ల చాలా కష్టాలు పడ్డామని చెప్పారు.తినడానికి తిండి లేని వేసుకోవడానికి బట్టలు లేని పరిస్థితి ఏర్పడిందని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

పరిగి దగ్గర ఉన్న రాపోలు నుంచి హైదరాబాద్ కు వచ్చామని ఆ సమయంలో తన వయస్సు 18 అని లక్ష్మీనారాయణ తెలిపారు.భూములు, బంగారం అన్నీ అమ్ముకున్నామని ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

అమవాస్యను, పౌర్ణమిని నమ్మినప్పుడు మంత్రాలను కూడా నమ్మాలని తాను 13 సంవత్సరాలు అనుభవించానని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Telugu Banamati, Interview, Ful Villain, Rgv, Villaintarzan-Movie

నాకు కడుపునొప్పి వచ్చేదని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సంతోషించామని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. ఆర్జీవీ సినిమాలలో తనకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.అనుకున్న స్టేజ్ కు అయితే ఇంకా రాలేదని ఆయన తెలిపారు.

Telugu Banamati, Interview, Ful Villain, Rgv, Villaintarzan-Movie

జీవితం చాలా చిన్నదని టార్జాన్ లక్ష్మీనారాయణ కామెంట్లు చేశారు.ఈ జీవితం గురించి చాలామంది ఫీల్ అవుతుంటారని లక్ష్మీనారాయణ వెల్లడించారు.పది ఇల్లు ఉన్నా ఒక ఇంట్లో మాత్రమే పడుకోగలమని రేపటికి రూపం లేని జీవితమని టార్జాన్ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలతో పాటు టార్జాన్ లక్ష్మీనారాయణ కామెడీ పాత్రలు కూడా చేశారు.

ఈ మధ్య కాలంలో టార్జాన్ లక్ష్మీనారాయణకు సినిమా ఆఫర్లు తగ్గాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube