ఆ విమానాల్లో 200 మంది పట్టడమే ఎక్కువ.అలాంటిది ఒకే విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణికులు ఎక్కి ప్రయాణం చేసారు.
ఇది ప్రస్తుతం ఆఫ్ఘన్ లో జరుగుతున్న దారుణం.ప్రాణ భయంతో జనాలు పరుగులు పెడుతున్నారు.
రెండు రోజులుగా ఆఫ్గనిస్తాన్ లో ఉన్న ప్రజలు భయంతో చస్తూ బ్రతుకు తున్నారు.ఆ దేశంలో తాలిబన్లు చేస్తున్న అల్లర్లకు ప్రజలు బలవుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లో తాలిబన్లు అడుగు పెట్టి ప్రజలను భయంతో బతికేలా చేస్తున్నారు.అక్కడి ప్రజలు దొరికిన విమానం ఎక్కి తమ ప్రాణాలను కాపాడు కుంటున్నారు.తాజాగా 200 మంది ప్రయాణికులు పట్టే ఒక విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణికులు ఎక్కి ప్రయాణించిన దృశ్యాలు ఇప్పుడు ఫోటోల రుణాపీలో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విమానం రవాణా విమానం కావడంతో సీట్లు ఉండవు కాబట్టి అంత మంది జనం నిలబడి ప్రయాణించారు.
అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఈ విమానంలో ఇంత ఎక్కువ మంది ఎక్కి ప్రయాణం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.ప్రస్తుతం కాబుల్ ఎయిర్ పోర్ట్ లో దృశ్యాలు చాలానే కనిపిస్తున్నాయి.
ఆ దేశం నుండి ప్రజలు ప్రాణాలతో బయట పడితే చాలు అని అనుకుంటున్నారు.కాబుల్ నుండి ఖతార్ కు వెళ్లే ఈ విమానంలో 640 మంది ప్రయాణికులు ఎక్కి ప్రయాణించారు.
ఇలాగె విమానంలో ఖాళీ లేక ఇంజిన్ మీద ఎక్కి ప్రయాణిస్తుండగా విమానం ఎగురుతున్న సమయంలో కింద పడి మరణించారు.కానీ ఇక్కడి ప్రజలు ఏమి ఆలోచించడం లేదు.కట్టు బట్టలతో దేశం విడిచి ప్రాణాలతో బయట పడితే చాలు అని అనుకుంటున్నారు.అందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.తమ దేశం విడిచి వెళ్లేందుకుఇష్టం లేకున్నా తాలిబన్ల వల్ల ప్రాణాలు పోకుండా బయట పడడం మేలని అనుకుంటున్నారు.