సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్లకంటే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇండస్ట్రీలో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి వారిలో ప్రస్తుతం ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు తమిళ్ , తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా రాణించి ఆ తర్వాత నటుడిగా మారి నేషనల్ అవార్డు లాంటి ప్రస్టేజియస్ అవార్డ్ గెలుచుకున్న దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య( SJ Surya )ఈయన తెలుగులో ఖుషి,పులి లాంటి సినిమాలు చేశారు.అలాగే మహేష్ బాబుతో నాని లాంటి సినిమా కూడా చేశాడు ఈ సినిమాల్లో ఒక ఖుషి సినిమా( kushi ) తప్ప మిగిలిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఇక దాంతో ఆయన డైరెక్షన్ చేయకుండా సినిమాల్లో నటిస్తున్నాడు.ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ కూడా దాదాపు కోట్లల్లో ఉంది కాబట్టి ఆయన సినిమాలు డైరెక్షన్ చేయకుండా సినిమాల్లో యాక్టింగ్ మాత్రమే చేస్తూ ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.ఇక ప్రస్తుతం ఆయన సినిమా డైరెక్షన్ చేసే పనిలో కూడా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఆ సినిమాలో తెలుగు స్టార్ హీరో నటించబోతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.అయితే ఆ స్టార్ హీరో ఎవరో అనేది ఇప్పటివరకు రహస్యంగా ఉంచినప్పటికి కొద్దిరోజుల్లోనే ఆ సినిమా అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అతను ఈ సినిమాలో నటిస్తూ డైరెక్షన్ కూడా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా వాళ్ల మళ్ళీ ఆయన డైరెక్టర్ గా రాణించాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా తో సక్సెస్ అయితే మళ్ళీ ఆయన కి డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు వస్తాయి…
.