2006లో విడుదలైన తెలుగు యాక్షన్ ఫిల్మ్ “పోకిరి”( Pokiri ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీనికి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
మహేష్ బాబు హీరోగా నటించాడు.ఈ సినిమా భారీ విజయం సాధించి అప్పులు, అపజయాలతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ కెరీర్‌కు మళ్లీ ప్రాణం పోసింది.
పోకిరి చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో దానిని తమిళం, హిందీ వంటి ఇతర భాషలలో రీమేక్ చేశారు.తమిళంలో కూడా “పోకిరి”( Tamil Movie Pokiri ) అనే పేరుతో దళపతి విజయ్ హీరోగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హిందీలో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వాంటెడ్( Wanted ) అనే టైటిల్ పెట్టారు.రెండు రీమేక్‌లు కూడా బాక్సాఫీస్ వద్ద కోట్లు సంపాదించి కమర్షియల్ గా విజయవంతమయ్యాయి.
ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకున్నాయి.
అయితే, కొంతమంది అభిమానులు సినిమా వివిధ వెర్షన్లలోని హీరోల పర్ఫామెన్స్ పోల్చడం ప్రారంభించారు.“శృతి నాదే గన్ను నాదే” అంటూ పోలీస్ ఆఫీసర్‌ని హీరో మహేష్( Mahesh Babu ) ఈ మూవీలో హెచ్చరిస్తాడు.ఈ హెచ్చరించే సన్నివేశంలో ఎవరు బాగా నటించారని ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు.
మహేష్ బాబు ఇంటెన్సిటీ, డైలాగ్ డెలివరీకి చాలా మంది తెలుగు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చాలా మంది తమిళ అభిమానులు కూడా మహేష్ బాబు నటనను అభినందిస్తున్నారు.
అయితే నిజానికి ఎవరు బాగా నటించారనేది ముఖ్యం కాదు.ఒక్కో నటుడి స్టైల్‌కు, ఇమేజ్‌కి తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దారు.
వివిధ భాషలు, ప్రాంతాల అభిమానులకు నచ్చేలా స్క్రిప్ట్, డైలాగ్స్‌లో మార్పులు చేశాడు దర్శకుడు.కథ, దర్శకత్వం, సంగీతం, యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ చిత్రం హిట్ అయ్యింది.
నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకులను అలరించారు.అందుకే వాటిని పోల్చి చూసే బదులు పోకిరి విజయాన్ని, రీమేక్‌లను ఎంజాయ్ చేయడం మంచిది.
బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించినందుకు సంతోషించాల్సిందే.హిందీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సల్మాన్ ఖాన్( Salman Khan ) సినిమాకు కొన్ని మార్పులు కూడా చేశాడు.అయితే ఈ హిందీ వాళ్ళు బాడీలు చూపించడం తప్ప ముఖంలో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ చూపించారనే విమర్శ ఉంది.అందుకే సల్లుబాయ్ యాక్టింగ్ మహేష్ యాక్టింగ్ తో ఎవరూ కూడా పోల్చడానికి ఆసక్తి కనబరచలేదు.