పేద ప్రజలను ఆదుకునేందుకు టి.ఆర్.ఎస్.ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ రోజు సనత్ నగర్ డివిజన్ లో సుమారుగా 93 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ డివిజన్ లో 93.60 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను దాసారం బస్తీ కమ్యూనిటీ హాల్ వద్ద 36 లక్షల రూపాయల తో నిర్మించిన సీవరేజ్ లైన్ ను, మోడల్ కాలనీ లో 18.60 లక్షల వ్యయంతో నిర్మించిన VDCC రోడ్డు, సౌభాగ్య నగర్ చౌరస్తాలో 27 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీవరేజ్ లైన్ ను, DNM కాలనీ మసీదు సమీపంలో 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్, అల్లా ఉద్దీన్ కోటి కమ్యూనిటీ హాల్ వద్ద 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సనత్ నగర్ డివిజన్ లోని ముఖ్యమైన ప్రాంతమైన అల్లావుద్దీన్ కోఠి లో ఎక్కువగా పేద ప్రజలు అయినా ముస్లిం మైనార్టీ పేద ప్రజలు ఎక్కువ ఉన్నారని వారి అభివృద్ధి కొరకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని ఆ పథకాలు ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ముఖ్యంగా అల్లావుద్దీన్ కోఠి లో అభివృద్ధి పనులు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన చేసి ఈ ప్రాంతంని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.