ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ( Thaapsee ).ఇలా మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అనంతరం పలు సినిమాలలో ఈమె నటించారు.
అయితే ఈమె నటించిన తెలుగు సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయాయి.ఇలా తెలుగులో తాప్సి నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈమె తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో తాప్సి పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అలాగే నేపోటిజం గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు క్యాస్టింగ్ కౌచ్ ( Casting Cauch ) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఈమె తెలియజేశారు.తనకు కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలియజేశారు.
తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇలాంటి ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నానని ఈమె తెలిపారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి తాను అడుగు పెట్టిన సమయంలో కొంతమంది దర్శకులు హీరోలు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి తనని గెస్ట్ హౌస్ కి రమ్మని పిలిచేవారు.తను మాత్రం అలాంటి దాన్ని కాదని చెప్పిన వినేవారు కాదని అలా ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని బలవంతం పెట్టారని తమ మాట వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రాకుండా చేస్తాము అంటూ తనను బెదిరించారని తాప్సీ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.హీరోలు మాత్రమే కాకుండా డైరెక్టర్లు కూడా తనను ఇబ్బందులకు గురి చేశారని, తాను మాత్రం భయపడకుండా తన మీద నమ్మకంతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇలా ఎదిగానని తాప్సి తెలిపారు.