కెనడాలో ఆ ఘోరానికి కారణం భారత సంతతి దొంగేనా..?

గత సోమవారం కెనడాలోని( Canada ) అంటారియోలో హైవేపై వాహనాలు ఢీకొన్న ఘటనలో భారతీయ దంపతులు మణివణ్ణన్,( Manivannan ) అతని భార్య మహాలక్ష్మీ( Mahalakshmi ) వారి మూడు నెలల మనవడు ఆదిత్య వివాన్( Aditya Vivaan ) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇదే ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులు గోకుల్‌నాథ్ మణివణ్ణన్, అశ్విత జవహర్ సురక్షితంగా బయటపడ్డారు.

 Suspected Indian-origin Robber Responsible For Head-on Crash That Killed Indian-TeluguStop.com

దొంగతనానికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

అంటారియోలోని( Ontario ) బౌమన్‌విల్లేలో మద్యం దుకాణంలో దోపిడి జరిగినట్లు తెలియడంతో పోలీసులు ఏప్రిల్ 29న ఛేజింగ్ చేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో వున్న విట్బీ హైవే 401లో( Highway 401 Whitby ) తప్పుదారిలో వెళ్లడంతో పోలీసులు నిందితుడిని వెంబడించారు.హైవేపై సెమీట్రాలర్ ట్రక్కును ఢీకొట్టిన యు హాల్ ట్రక్కు వెనుక నిందితుడు గగన్‌దీప్ సింగ్ ( Gagandeep Singh ) చిక్కుకుపోయి అక్కడికక్కడే మరణించినట్లు ది టొరంటో స్టార్ వార్తాపత్రిక నివేదించింది.

Telugu Aditya Vivaan, Bowmanville, Canada, Gagandeep Singh, Grandson, Crash, Ind

గగన్‌దీప్.5 వేల కెనడియన్ డాలర్ల విలువైన మూడు చోరీ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.కోర్టు పత్రాల ప్రకారం ఓక్‌విల్లే మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తిపైనా అతను దాడికి పాల్పడినట్లుగా అభియోగాలు వున్నాయి.వ్యాన్‌లో ప్రయాణించిన మన్‌ప్రీత్ గిల్ (38) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గగన్‌దీప్‌ గతంలో చేసిన నేరాలకు గాను రిలీజ్ అయ్యాడు.అయితే మే 14న మరోసారి కోర్టు ఎదుట హాజరుకావాల్సి వుండగా ఈ ఘటన జరిగింది.

Telugu Aditya Vivaan, Bowmanville, Canada, Gagandeep Singh, Grandson, Crash, Ind

ఇతని నేర చరిత్ర ఫెడరల్ కన్జర్వేటివ్ నాయకుడు పియరీ పోయిలీవ్రే సహా కొందరు నేతల ఆగ్రహానికి దారితీసింది.బలమైన బెయిల్ వ్యవస్థల ద్వారా మరణాలను నిరోధించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.గగన్‌దీప్ సింగ్ మరణించే సమయానికి ఆయనపై పలు అభియోగాలు బాకీ వున్నాయి.మరోవైపు కెనడా నేరస్తులకు స్వాగతం పలుకుతోందని.ఆశ్రయం కల్పిస్తోందని భారత్ చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube