మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.ఇప్పటికే వెబ్ సీరీస్ తో వచ్చిన సుస్మిత ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.
అది కూడా తమిళ సూపర్ హిట్ సినిమా 8 తొట్టకల్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాత్రుక దర్శకుడు శ్రీ గణేష్ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ ను తీసుకుంటున్నారట.ఈమధ్యనే ఏక్ మిని కథ అంటూ ఓటిటిలో రిలీజైన సినిమాతో హిట్ అందుకున్నాడు సంతోష్ శోభన్.
ఇప్పుడు అతనికిం వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఆల్రెడీ వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా సైన్ చేసిన సంతోష్ శోభన్ లేటెస్ట్ గా సుస్మిత ప్రొడ్యూస్ చేస్తున్న రీమేక్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో సంతోష్ శోభన్ పోలీస్ పాత్రలో నటిస్తాడని చెబుతున్నారు.మొత్తానికి సుస్మిత ఫస్ట్ ఫీచర్ మూవీలో ఛాన్స్ అందుకున్నాడు సంతోష్ శోభన్.అతనికి మెగా అండదండలు కూడా ఉంటాయని చెప్పొచ్చు.సుస్మిత ప్రొడ్యూస్ చేస్తుంది అంటే సినిమాకు మెగా ప్రమోషన్స్ షురూ అయినట్టే.
సో ఎలా లేదన్నా సంతోష్ సరైన ట్రాక్ ఎక్కినట్టే అని చెప్పుకోవచ్చు.