కోలీవుడ్ హీరోల్లో సూర్య( Suriya ) ఒకరు.ఈయనకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందొ చెప్పాల్సిన పని లేదు.
సూర్య జై భీమ్( jai Bhim ) విక్రమ్ వంటి సినిమాతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.ముఖ్యంగా విక్రమ్ సినిమాలో ఫుల్ నెగిటివ్ రోల్ లో సూర్య రోలెక్స్ గా నటించి ఫ్యాన్స్ ను తన నటనతో మెప్పించాడు.
ఈ పాత్రకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభించింది.
విక్రమ్ సినిమాను లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయగా కమల్ హాసన్ హీరోగా నటించారు.
ఈ రోలెక్స్ పై మంచి స్పందన రావడంతో డైరెక్టర్ లోకేష్ ఈ రోలెక్స్ ను సపరేట్ గా సినిమాగా తీస్తానంటూ కన్ఫర్మ్ చేసాడు.ఈ సినిమాపై ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వస్తుండగా తాజాగా సూర్య ఈ రోలెక్స్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య తన ఫ్యాన్స్ కోసం జరిగిన ఫ్యాన్ మీట్ లో లోకేష్ తనకు ఒక లైన్ స్క్రిప్ట్ వినిపించాడని ఇది కంప్లీట్ గా రోలెక్స్ పై ఉండే సినిమా అంటూ కన్ఫర్మ్ చేసేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని స్ట్రాంగ్ గా తేలిపోయింది.మరి ప్రజెంట్ లోకేష్ విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సూర్య స్క్రిప్ట్ రో మూవీ చేస్తాడా లేదంటే ఇంకాస్త సమయం పడుతుందా అనేది చూడాలి.
ఇక సూర్య కూడా ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ కంగువ సిని( Kanguva movie )మాతో బిజీగా ఉన్నాడు.డైరెక్టర్ శివ దర్శకత్వంలో ”కంగువ” తెరకెక్కుతుండగా యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.
కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.