సన్నీ లియోన్ కోరిక తీరేలా ఉంది

హాట్ భామ సన్నీ లియోన్ చిన్ననాటి నుండి ఆమీర్ ఖాన్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.అమీర్ ని ఒక్కసారైనా చూస్తే చాలు అనే స్టేజ్ నుంచి ఆమీర్ ఖాన్ ఇంట్లో పార్టీకి ఆహ్వానం పొందే స్థాయికి ఎదిగింది సన్ని

 Sunny Leone To Act With Aamir Khan In A Comedy Film-TeluguStop.com

ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమీర్ నాతో ఎప్పటికి నటించడు అని సన్ని బాధపడటం, నేను నీతో నటిస్తాను అని ఆమీర్ మాటివ్వడం అంతా చకచక జరిగిపోయాయి.

ఇప్పుడు ఆమీర్ కి సన్ని మంచి ఫ్రెండ్.సన్ని అదృష్టం బాగుంటే తాను ఆమీర్ సహనటి కూడా అవొచ్చు

ప్రస్తుతం దంగల్ షూటింగ్లో బీజిగా ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, ఆ తరువాత ఏ సినిమా చేస్తాడనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాని, ఆమీర్ నిర్మాణంలో ఢిల్లి బెల్లి చిత్రానికి దర్శకత్వం వహించిన అభినయ్ డియో ఒక కామెడి కథ వినిపించాడట హీరోగారికి.

ఇందులో సన్ని లియోన్ కూడా ఉంటుందట.అయితే హీరోయిన్ గా కాదు.

ఒక కీలక పాత్ర సన్ని కోసం రాసాడంట దర్శకుడు.అయితే ఆమీర్ మాత్రం ఇంకా తన స్పందన తెలియజేయలేదట

సన్ని లియోన్ ఆమీర్ నిర్ణయం ఎలా ఉంటుందో అని టెన్షన్ గా ఫీల్ అవుతోందట.

ఈ సినిమా గనుక పట్టాలెక్కితే సన్ని దశ తిరిగినట్లే.అభిమాన హీరోతో చేయడం కన్న ఇంకా ఏం కావాలి ఓ హీరోయిన్ కి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube