కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై( MLC Jeevan Reddy ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
జీవన్ రెడ్డి లాంటి పెద్దలకు ఇలాంటి పనులు తగదని కవిత తెలిపారు.అయితే బీఆర్ఎస్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ హైకమాండ్ అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు.బీఆర్ఎస్( BRS ) కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆమె కేసులకు భయపడేది లేదని తెలిపారు.
హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ పై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.