తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం కోసం ఇండస్ట్రీలో తమదైన రీతిలో చాలా సినిమాలు చేస్తూ ఉంటారు.ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న చాలా మందితో వాళ్లకి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఇక ఈ పరిచయాలతో సినిమాల్లో అవకాశాలను కూడా అందుకుంటారు అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు… సుబ్బరాజు ఆ కోవ కు చెందిన వ్యక్తే… మొదటగా సుబ్బరాజు( Subbaraju ) కృష్ణవంశీ ఇంట్లో ఏ సి రిపేర్ ఉంటే అది రిపేర్ చేయడానికి వెళ్లిన సుబ్బరాజుని కృష్ణవంశీ సినిమాలో నటిస్తావా అని అడిగాడు అతను నటించను అని చెప్పిన కూడా అతని చేత చిన్న క్యారెక్టర్ లో నటింపజేసి నటుడిగా ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్( Puri Jagannadh ) సినిమాల్లో వరుసగా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తు ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా చాలా వైవిధ్యంగా ఉండటం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు సుబ్బరాజు హీరోగా కొన్ని సినిమాలు కూడా వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఇక ఈయన చేసిన సినిమాల్లో ఈయన పోషించిన క్యారెక్టర్లు చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి.ఇక ఈయన ఒక టిపికల్ క్యారెక్టర్జేషన్ ని చేస్తూ తనకు తానే పోటీ అన్న రేంజ్ నటిస్తూ ఉంటాడు.ఇక ఇప్పటికీ కూడా సుబ్బరాజు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నాడు.ఇక తన జీవితంలో తను పెళ్లి చేసుకోను అని చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.సింగిల్ గా ఉండడమే తనకి ఇష్టం అన్నట్టుగా తెలియజేశాడు…ఇక ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఆయన తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కూడా నటిస్తూ అందరికీ ఫేవరెట్ నటుడిగా మారుతున్నాడు…ఇక ఈయన ఒక తమిళ్ డైరెక్టర్ డైరెక్షన్(Tamil director ) లో హీరో గా చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
.