అగ్ర రాజ్యం అమెరికాలో చదువుకోవాలని, ఆ తరువాత అక్కడే ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని ఎంతో మంది భారత్ విద్యార్ధులు కలలు కంటుంటారు.అప్పో సొప్పో చేసి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి తమ పిల్లలను అమెరికా చదువులకు పంపే తల్లి తండ్రులు కూడా ఎంతో మంది ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు అమెరికా డాలర్ విలువ పెరగడం బిగ్ షాక్ ఇస్తోంది.రెండేళ్ళ క్రితం ఉన్న డాలర్ విలువకి ఇప్పటికి ఎంతో తేడా ఉంది.
దాంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులపై తలకు మించిన భారం పడుతోంది.
ప్రతీ ఏటా దేశ వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు.
ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచీ వెళ్ళే విద్యార్దుల సంఖ్యే అత్యధికంగా ఉంటుంది.అయితే ఇలా అమెరికా వెళ్ళే వారు అక్కడ తమ చదువు పూర్తయ్యే వరకూ ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి ఫీజులు ఉంటాయి.
అక్కడ పార్ట్ టైం ఉద్యోగం దొరికితే ఎంత వరకూ డబ్బు ఆదా అవుతుంది అంటూ లెక్కలు వేసుకుని మొత్తం ఖర్చులో ఒక లక్ష అటు ఇటుగానే బడ్జెట్ వేస్తారు.కానీ ప్రస్తుత పరిణామాల కారణంగా విద్యార్ధుల, వారి తల్లి తండ్రుల అంచనాలు తారుమారు అవుతున్నాయి.ఉదాహరణకు

గతేడాది చేరిన విద్యార్ధుల ఫీజులు, భోజన, హాస్టల్ వసతి, అడ్మిషన్ ఫీజులు, ఇతర ఖర్చులు పోల్చి చూస్తే ఏడాదికి సుమారు రూ.36 లక్షలు ఖర్చు ఉంటుంది.ఇదే సమయంలో డాలర్ విలువ 81 కి చేరడంతో ఇవే ఖర్చులు ఇప్పుడు రూ.42 లక్ష్జలు అవుతున్నాయి .అంటే విద్యార్ధులపై అధిక భారం పెరుగుతోంది.ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎంతో మంది భారతీయ విద్యార్ధులు ఎదుర్కుంటున్నారని కొంత మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు నిపుణులు.