తూర్పు గోదావరి జిల్లాలో స్టూడెంట్స్ మధ్య వార్ జరిగింది.రాజానగరంలోని జెడ్పీ స్కూల్ లో తొమ్మిదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది.
వివాదం కాస్తా ముదరడంతో ఓ విద్యార్థి మరో ఇద్దరు విద్యార్థులను కత్తితో పొడిచాడు.దీంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఉపాధ్యాయుల ఎదుట ఎగ్జామ్ హాల్ లో ఈ ఘటన జరగడంతో మిగతా విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.