వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో సిద్దహస్తుడు అనే సంగతి అందరికీ తెలిసిందే.ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ పెట్టి ప్రజల్లో సింపతీ సంపాధించుకోవడంలో సక్సస్ అయ్యారు.
ఆ తరువాత ఓదార్పు యాత్ర అంటూ సెంటిమెంట్ తో ప్రజలందరి చూపును తనపై పడేలా చూసున్నారు.ఫలితంగా 2014 ఎన్నికల్లో 67 సీట్లు కైవసం చేసుకొని టీడీపీ( TDP )కి తిరుగులేని పోటీ ఇచ్చారు.
దీంతో సెంటిమెంట్ పాలిటిక్స్ కు ప్రజలు ఏ స్థాయిలో ఆకర్షితులౌటారో ఆ ఎన్నికలతోనే వైఎస్ జగన్ కు తెలిసొచ్చిందనే చెప్పాలి.
దాంతో 2019 ఎన్నికల్లో సెంటిమెంట్ డోస్ ఇంకాస్త పెంచి ఒక్కసారి మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి అంటూ జగన్ చేసిన సెంటిమెంట్ రాజకీయం ఏపీ ప్రజలందరిని కట్టిపడేసింది.
దీంతో ఇతర పార్టీలు దరిదాపుల్లో నిలవలేనంతా మెజారిటీతో భారీ విజయాన్ని కట్టబెట్టారు ఏపీ ప్రజలు.గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు వైసీపీ( YCP ) కైవసం చేసుకుంది అంటే.
ఆ విజయంలో మెజారిటీ భాగం జగన్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రమే అని చెప్పక తప్పదు.ఏక వచ్చే ఎన్నికలో ఇదే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారనే చెప్పాలి.
మీ నుంచి మీ బిడ్డను దూరం చేయడానికి తోడేళ్ళంతా ఏకమౌతున్నాయని, అయిన మీ బిడ్డకు భయం లేదని, మీ బిడ్డకు మీరే తోడని, ఇలా సెంటిమెంట్ వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో సింపతీని సంపాదించే పనిలో ఉన్నారు జగన్.
ఎంతలా అంటే ప్రస్తుతం పెడుతున్న ఏ బహిరంగ సభలోను పదే పదే ” మీ బిడ్డ.” అంటూ సెంటిమెంట్ పండిస్తున్నారు సిఎం జగన్.అయితే ఈ సారి జగన్ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదని కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.
గత ఎన్నికల టైమ్ లో ఒక్కసారి మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి అంటూ పండించిన సెంటిమెంట్ కు తిరుగులేని విజయాన్ని ఇచ్చారు ప్రజలు.
అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పరిపాలనపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తున్నారు.సంక్షేమం తప్పా అభివృద్దిని గాలికి ఒదిలేశారనే భావనా ప్రతిఒక్కరిలో ఉంది.దాంతో ఈసారి ఎన్నికల్లో జగన్ సెంటిమెంట్ ను ప్రజలు పట్టించుకోవడం కష్టమే అని కొందరి అభిప్రాయం.
మరి ఈసారి జగన్ వల్లిస్తున్న సెంటిమెంట్ వ్యూహానికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.