అరుదైన ఘనత.. అంధుల కోసం ప్రత్యేక బూట్లు చేసిన విద్యార్థి..!

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను మీరు వినే ఉంటారు.సరిగ్గా ఈ సామెతను నిజం చేసాడు తొమ్మిదో తరగతి చదివే ఒక పిల్లాడు.

 Student Made Special Shoes For The Blind , Blind People , Social Media , Stud-TeluguStop.com

వయసు చిన్నదే కానీ ఆలోచన మాత్రం గొప్పది.ఈ చిన్న బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలను నింపుకున్నాడు.

బాలుడు తనకు ఉన్న చిన్న బుర్రకు పదును పెట్టి సరికొత్త ప్రయోగం చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచేసాడు.శాస్త్రవేత్తలు సైతం నివ్వేరపోయేలాగా అంధుల కోసం ఒక సరికొత్త బూట్లను తయారు చేశాడు ఈ విద్యార్థి.

మరి ఆ విద్యార్థి వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా.

అస్సోంలోని కరీంగంజ్ కు చెందిన అంకురిత్ కర్మాకర్ అనే విద్యార్థి అందుల కోసం సరికొత్తగా బూట్లను తయారుచేసాడు.

ఈ బూట్ల యొక్క వెరైటీ ఏంటంటే ఆ బూట్లను ధరించి నడిస్తే ఎవరన్నా వాళ్లకు అడ్డు వస్తే ఆ బూట్లు శబ్దాలు చేసి వెంటనే వాళ్ళను అప్రమత్తం చేస్తాయన్నమాట.అంకురిత్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

భవిష్యత్తులో ఇంకా ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు.అంధులు ఈ ప్రత్యేక బూట్లు ధరించి రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా వాహనం కానీ, వ్యక్తులు కానీ వచ్చినప్పుడు వాళ్ళని అలెర్ట్ చేసేలాగా బూటులో ఒక సెన్సార్‌ ను ఏర్పాటు చేసాడు.

Telugu Blind, Karinganj Assam, Ninth Grade, Shoes-Latest News - Telugu

ఎదురుగా ఎవరన్నా వచ్చినప్పుడు ఈ బూటులోని సెన్సార్ పెద్దగా శబ్దాలు చేస్తూ వాళ్ళకు ముందస్తు సూచన చేస్తుంది.చూపు కోల్పోయిన వారి కోసం ఈ సరికొత్త పరికరాన్ని కనిపెట్టినట్టు అంకురిత్‌ చెబుతున్నాడు.తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ పరికరాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపాడు.రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని, ఎప్పటికయినా శాస్త్రవేత్త అవ్వడమే తన లక్ష్యమని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube