వీడియో వైరల్: కచ్చా బాదాం పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన బాలీవుడ్ తారలు..!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయి.సోషల్ మీడియా వేదికగా చాలామంది తమలోని టాలెంట్ ను బయట పెట్టారు.

 Viral Video Bollywood Stars Dance To Kachcha Badam Song Details, Viral Latest,-TeluguStop.com

అలా రాత్రికి రాత్రే ఉన్నటుండి ఒక సెలబ్రిటీలాగా మారిపోయారు.ఈ క్రమంలోనే విధుల్లో వేరుశెనగలు అమ్ముకునే ఒక వ్యక్తి పాడిన పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభంజనాన్ని సృష్టిస్తు అతన్ని ఒక సెలబ్రిటీలాగా మార్చేసింది.ఇంతకీ ఆ పాట ఏంటి అనుకుంటున్నారా.? భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ వస్తున్న “కచ్చా బాదం సాంగ్ “ ఈ పాటకు సోషల్ మీడియాలో ఎంతగానో క్రెజ్ ఏర్పడింది.ఈ సాంగ్‌కు నెటిజన్లు, సెలబ్రేటీలు, పిల్లలు, పెద్దలు అందరు కూడా తెగ డ్యాన్స్‌లు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.ఇటీవల అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ కూడా ఆ పాటకు డాన్స్‌ చేసింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు కచ్చా బాదం పాటకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధూరీ దీక్షిత్, ప్రముఖ బాలీవుడు హీరో రితేష్ దేశ్‏ముఖ్ ఇద్దరు కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు.వీరికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వస్తుంది.

కచ్చా బాదం పాటకు హీరో రితేష్ దేశ్‏ముఖ్, హీరోయిన్ మాధురీ దీక్షిత్ కలిసి చాలా చక్కగా, చూడముచ్చటగా స్టెప్పులేసి ఆధరగొట్టారు.ఈ వీడియోను మాధురీ దీక్షిత్ తన ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.

అలాగే ఈ పాటకు సంబందించిన వీడియోతో పాటు ‘ఇది చాలా సరదాగా ఉంది, కదా ?’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఈ వీడియో చూసి నేటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.

చాలా బాగా డాన్స్ చేసారు అంటూ నేటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఇక ఈ పాట విషయానికి వస్తే.ఈ పాటను పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన పచ్చివేరుశనగల వ్యాపారీ భువన్‌ బద్యాకర్‌ పాడారు.తన వేరుశెనగలను అమ్మే క్రమంలో భువన్ ఈ పాటను పాడుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

అసలు ఇంతకీ ఈ కచ్చా బాదం అంటే ఏంటో తెలుసా… బెంగాలీలో కచ్చా బాదాం అంటే పచ్చివేరుశెనగ అని అర్థం అంట.భువన్ బద్యాకర్ స్వయంగా ఈ ‘కచ్చా బాదం’ పాటను కంపోజ్ చేశాడు.బెంగాల్ గిరిజన బౌల్ జానపద పాట ఆధారంగా ఈ పాట రూపొందించబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube