తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న టువంటి వారిలో నటుడు నాగార్జున ( Nagarjuna ) ఒకరు.ఈయన అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.
ఇండస్ట్రీకి మన్మధుడుగా ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడుగా ఒకానొక సమయంలో ఎంతో మంది మహిళా అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున ఇప్పటికి పలు సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేస్తున్నారు.
ఇక కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున సినిమాలలో నటించడానికి చాలామంది హీరోయిన్ స్థిరపడుతూ ఉంటారు.కానీ ఒక హీరోయిన్ మాత్రం నాగార్జునతో నటించడానికి ఏమాత్రం ఇష్టపడలేదట.ఇలా ఆ హీరోయిన్ నాగార్జున సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు నాగార్జునకి ఉన్నటువంటి ఒక అలవాటు కారణంగానే ఈమె ఆ సినిమా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.మరి నాగార్జునకు ఉన్నటువంటి ఆ అలవాటు ఏంటి ఏ హీరోయిన్ ఈయన సినిమాని రిజెక్ట్ చేసింది ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే …
నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించిన సోగ్గాడే చిన్నినాయన( Soggaade chinninayana ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే.ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాబినయంలో నటించి మెప్పించారు.ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో ముందుగా వేరే నటికి అవకాశం వచ్చిందట అయితే ఆమె సినిమా కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమాలో నాగార్జునకు ఉన్నటువంటి ఒక అలవాటు కారణంగానే తాను ఈ సినిమాలో నటించనని రిజెక్ట్ చేశారట.
రమ్యకృష్ణ కంటే ముందుగానే ఈ సినిమాలో నదియాకు అవకాశం కల్పించారు.ఇక సినిమా మొత్తం విన్నటువంటి నదియా( Nadiya ) ఈ సినిమాలో నాగార్జున తరచూ రమ్యకృష్ణ ( Ramya Krishna ) నడుం గిల్లుతూ ఉంటారు.మాటికి నడుము గిల్లించుకోవడం ఇష్టం లేనటువంటి నదియా ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఈమె స్థానంలో రమ్యకృష్ణకు ఆ అవకాశం కల్పించారు.
ఇక ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో నదియా కనుక నటించి ఉంటే ఈ సినిమా మరింత సక్సెస్ అయ్యేదని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ప్రస్తుతం నాగార్జున సినిమాల విషయానికి వస్తే నా సామిరంగా సినిమాతో పాటు బిగ్ బాస్ ( Bigg Boss )కార్యక్రమానికి హాజరుగా వ్యవహరిస్తున్నారు.