మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) – గోపీచంద్ మలినేని( Gopichand Malinen ) కాంబో మరోసారి అఫిషియల్ అయిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేనితో రవితేజ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.
ఇక ఇప్పుడు నాలుగవ సారి కూడా ఈ కాంబో రిపీట్ కావడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఎగ్జైట్మెంట్ బాగా పెరిగింది.డాన్ శీను, బలుపు, క్రాక్ ఇలా మూడు సినిమాకు బాగానే హిట్ అయ్యాయి.
క్రాక్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు మాస్ రాజాను మరోసారి ఫామ్ లోకి తెచ్చింది.కొత్త మూవీ ఇటీవలే అనౌన్స్ చేసారు.మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి హీరోయిన్ గురించి ఏదొక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది.

ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి.మాస్ రాజా సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డేను సెట్ చేసారని ఆల్మోస్ట్ వీరి పెయిర్ కన్ఫర్మ్ అయినట్టే అనే టాక్ వచ్చింది.అయితే ఇప్పుడు మాత్రం రవితేజ సరసన ధమాకా బ్యూటీ శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా నటిస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.
శ్రీలీల, రవితేజ ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఈ సినిమాతోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపొయింది.మరి మరోసారి ఈ జోడీ నిజంగానే కలసి నటిస్తే ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి.ఏ ఇద్దరు బ్యూటీలలో చివరికి ఎవరు కన్ఫర్మ్ అవుతారో వేచి చూడాల్సిందే.
రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) చేస్తుండగా ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.అలాగే ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ సినిమా( Eagle movie ) చేస్తున్నాడు.
ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.