కొత్త ఆయుకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.అనంతరం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Special Measures On Projects To Give Water To New Life Expectancy..: Minister Ut-TeluguStop.com

కొత్త ఆయుకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

మంథని నియోజకవర్గానికి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.రాబోయే వేసవికాలంలో చెరువుల పూడిక, జంగిల్ కటింగ్ చేపట్టాలని తెలిపారు.

వచ్చే వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తి కావాలని తెలిపారు.రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని వెల్లడించారు.

కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube