కొత్త ఆయుకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

అనంతరం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.కొత్త ఆయుకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.మంథని నియోజకవర్గానికి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రాబోయే వేసవికాలంలో చెరువుల పూడిక, జంగిల్ కటింగ్ చేపట్టాలని తెలిపారు.వచ్చే వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తి కావాలని తెలిపారు.

రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని వెల్లడించారు.కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.

దుబాయ్: 5-స్టార్ రిసార్ట్ బాల్కనీలో బట్టలు ఎండేసిన ఇండియన్ మహిళ.. చివరికి?