చాలావరకు ఎవరైనా ఏదైనా కొటేషన్ పెట్టారు అంటే అది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించినట్లుగా ఉంటుంది.నిజానికి ఎవరైనా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడే దానిని ఇతరులకు తమ బాధగా, అనుభవంగా తెలియజేస్తుంటారు.
ఇక ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఉంది కాబట్టి.తమ మనసులో ఏది అనిపించినా వెంటనే కొటేషన్స్ రూపంలో షేర్ చేసుకుంటారు.
కేవలం సామాన్యులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో కొన్ని అనుభవాలను పంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ సింగర్ జీవితం గురించి ఒక అద్భుతమైన కొటేషన్ షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఇంతకు ఆ సింగర్ ఎవరంటే హేమచంద్ర.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సింగర్.
ఈయన 2004లో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు.
ఈయన మణిశర్మ సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమాలో వచ్చిన నిలువవే అనే పాటతో పరిచయమయ్యాడు.ఇక ఆ తర్వాత ఎన్నో పాటలు పాడగా చాలా వరకు తన పాటలకు మంచి గుర్తింపు అందుకున్నాడు.
పైగా పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.

హేమచంద్ర మొదట 2005లో జరిగిన సరిగమప పాటల పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచాడు.ఇక ఆ షోలో ఆయన ఎన్నో పాటలు పాడి మంచి పరిచయం పెంచుకున్నాడు.అంతేకాకుండా అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు హేమచంద్ర.ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే.
ఈయన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి.
ఈయనకు చిన్నప్పుడే మ్యూజిక్ పట్ల బాగా ఆసక్తి ఉండటంతో చిన్నప్పుడే సంగీత శిక్షణ పొందాడు.
మరో సింగర్ శ్రావణ భార్గవిని 2013లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.ఇక వీరికి ఒక పాప కూడా ఉంది.
ఇక ఇటీవలే హేమచంద్ర, శ్రావణ భార్గవి పేర్లు వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా నిలిచాయి.వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా టాక్ నడిచింది.

కానీ అదంత పుకారు అని.కావాలని తమను అలా చేస్తున్నారు అని ఆ మధ్య ఈ జంట స్పందించింది.తాము విడాకులు తీసుకోవడం లేదు అని.ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పారేశారు.ఇక ఈ జంట సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తమకు సంబంధించిన రీల్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటారు.
అప్పుడప్పుడు తమ ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంటారు.ఇక హేమచంద్ర కొన్ని కొన్ని సార్లు కొన్ని కొటేషన్స్ కూడా బాగా షేర్ చేసుకుంటాడు.
తాజాగా హేమచంద్ర ఒక కొటేషన్స్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఇంతకు అందులో ఏముందంటే.
పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పోవాల్సిందే.కాబట్టి గుర్తిండి పోయేలా జీవించండి.
అంటూ షేర్ చేసుకున్నాడు హేమచంద్ర. ప్రస్తుతం ఈ కొటేషన్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.