తెలంగాణలో బీజేపీ రోజు రోజుకో వ్యూహంతో ప్రణాళికలు రచిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకుంటోంది.అయితే తెలంగాణలో ఉండే సాంప్రదాయ రాజకీయం తరహాలో కాకుండా చాలా వినూత్న రీతిలో రెచ్చగొట్టే రీతిలో రాజకీయ వ్యవహార శైలిలో బీజేపీ రాజకీయం కొనసాగిస్తునదన్న విషయం తెలిసిందే.
అందుకు ముఖ్య ఉదాహరణ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్య లక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడం.అక్కడ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అందరి చూపు బీజేపీ పై పడింది.
మొత్తం ఓవైసీ ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు భవిష్యత్ రాజకీయాలపై బీజేపీకి ఉన్న వ్యూహాన్ని బట్ట బయలు చేసింది.అయితే హైదరాబాద్ లో బీజేపీ హాట్ టాపిక్ గా మారాలంటే ఓల్డ్ సిటీ రాజకీయం ద్వారానే హైదరాబాద్ లో క్రమక్రమంగా బలపడవచ్చు అన్నది బీజేపీ ప్రధాన వ్యూహం, రానున్న రోజుల్లో బీజేపీ రాజకీయం కూడా ఇలాగే ఉండేలా కనిపిస్తోంది.
అయితే టీఆర్ఎస్- ఎంఐఎం కలిసి పని చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ హైదరాబాద్ లో సత్తా చాటడం కత్తి మీద సాము వ్యవహారమైనప్పటికీ ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే బీజేపీ కొంత అనుకూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అయితే ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ పోటీ చేసిన పరిస్థితి లేదు.ఎందుకంటే అక్కడ ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.కావున టీఆర్ఎస్ కు ఎంఐఎం కు మైత్రి ఉండడం మరొక కారణం.
అయితే ఓల్డ్ సిటీలో బీజేపీ ప్రాబల్యం పెరిగితే రాష్ట్ర రాజకీయాలలో ఒక పెద్ద సంచలనంగా మారుతుంది.అయితే ఇప్పటి వరకు ఎంఐఎం బీజేపీపై రాష్ట్ర స్థాయి అంశాలపై వ్యాఖ్యలు చేయకున్నా ఎప్పటికైనా బీజేపీ- ఎంఐఎం వార్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది.