న్యూయార్క్‌లోని ( New York )ఓ హోటల్‌లో ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది.ఆమె పేరు డెనిస్ ఒలియాస్-అరాన్సిబియా( Denis Olias-Arancibia ) అని పోలీస్ అధికారులు గుర్తించారు.38 సంవత్సరాలు వయసున్న ఈ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో మృతురాలు నివసించేది.
అయితే ఈమెను ఇంత కిరాతకంగా చంపింది ఎవరు? చంపడానికి అసలు కారణం ఏంటి? అనే కోణంలో పోలీసులు ఆరా తీసి సంచలన నిజాలు తెలుసుకున్నారు.అన్ని కోణాల్లో విచారణ జరిపాక రాద్ అల్మన్సూరి ( Rad Almansuri )అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడని కేసు ఫైల్ చేశారు.
ఆ హత్యను తానే చేసినట్లు ఈ వ్యక్తి ఆల్రెడీ ఒప్పుకున్నాడు.రాద్ కు 26 ఏళ్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 8న సోహో( Soho ) 54 హోటల్‌లో ఆమె చనిపోయినట్లు అధికారులు కనుగొన్నారు.11వ అంతస్థులోని గదిలో ఆమె మృతదేహాన్ని హోటల్ వర్కర్ కనుగొన్నాడు.ఆ సమయంలో ఆమె శవం పై ఒక దుప్పటి కప్పి ఉంచారు.ఆమె పక్కన నెత్తుటి ఐరన్ రాడ్ కనిపించింది.ఆమె తలపై ఎవరో బలంగా కొట్టి మెడను బిగించడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు పోస్టుమార్టం లో తెలుసుకున్నారు.
ఫిబ్రవరి 18న అరిజోనాలో మిస్టర్ అల్మన్సూరిని పోలీసులు పట్టుకున్నారు.అరిజోనా( Arizona ) అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని మరో రాష్ట్రం.వాస్తవానికి ఇది న్యూయార్క్‌కు చాలా దూరంగా ఉంటుంది.
ఈ రాష్ట్రంలో అల్మన్సూరి చాలా చెడ్డ పనులు చేశాడు.అతను మెక్‌డొనాల్డ్స్ బాత్రూంలో ఒక మహిళను కత్తితో పొడిచి, ఓ కారులో పారిపోయాడు.
అరిజోనాలోని ఫీనిక్స్‌లో తన కారులో ఒక మహిళను ఎక్కించుకొని ఆమెను కూడా పొడిచాడు.ఎమ్మెస్ ఒలియాస్-అరాన్సిబియాను కూడా తానే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
ఇంటర్నెట్‌లో “సోహో 54 హోటల్” కోసం సెర్చ్ చేయాలని పోలీసులకు సలహా ఇచ్చాడు.
అల్మన్సూరిని తిరిగి న్యూయార్క్ తీసుకురావాలని పోలీసులు కోరుతున్నారు.అతనిపై హత్యా నేరం మోపనున్నారు.అతను అరిజోనాలో ప్రజలను చంపడానికి ప్రయత్నించడం, వారిని బాధపెట్టడం వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటాడు.
అరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్( Arizona, Florida, Texas ) వంటి అనేక రాష్ట్రాల్లో చట్టాన్ని ఉల్లంఘించిన నేర చరిత్ర అతనికి ఉంది.తరచుగా ప్రజలను, ముఖ్యంగా అతని కుటుంబాన్ని లేదా భాగస్వాములను బాధపెడతాడు.
పోలీసులు మరిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు.అల్మన్సూరి ఎక్కువ మందిని బాధపెట్టాడా లేదా చంపాడా అని వారు తెలుసుకోవాలనుకుంటున్నారు.
మహిళలను మాత్రమే చంపేసే ఈ సీరియల్ కిల్లర్ గురించి తెలుసుకుని చాలామంది విస్తుపోతున్నారు.