ఇండియానాలో( Indiana ) 32 ఏళ్ల క్రితం ఒక గర్భవతి మరణించింది.సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి తాలూకు వివరాలను పోలీసులు వెంటనే గుర్తిస్తారు కానీ ఈ మహిళ గుర్తింపు మాత్రం గత 32 ఏళ్లుగా ఒక మిస్టరీగా ఉండిపోయింది.
ఆమె ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఎట్టకేలకు ఆమె వివరాలను పోలీసులు తెలుసుకోగలిగారు.
వారి ఆమె పేరు తబెతా ఆన్ ముర్లిన్( Tabetha Ann Murlin ) అని తెలుసుకున్నారు.చనిపోయే నాటికి ఆమె వయసు 23 ఏళ్లు, ఆరు నెలల గర్భిణి కూడా.1992, మేలో ఫోర్ట్ వేన్‌లోని( Fort Wayne in May ) నేలమాళిగలో ఆమె మృతదేహాన్ని అప్పటి అధికారులు గుర్తించారు.ఆమె భౌతిక కాయం అప్పటికే బాగా కుళ్లిపోయింది.
వారు ఒక వారం తర్వాత ఆమెను పాతిపెట్టారు, పేరు తెలియక తాత్కాలికంగా ఆమెను మేరీ జేన్ డో అని పిలిచారు.
ఆమె ఎవరో, ఎలా చనిపోయిందో ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నించినా కుదరలేదు.కొన్నాళ్ల తరువాత కేసు మూలన పడింది.2016లో, వారు NAMUS అనే సిస్టమ్‌లో ఆమె కోసం కొత్త కేసు ఓపెన్ చేశారు.ఈ వ్యవస్థ తప్పిపోయిన, గుర్తించబడని వ్యక్తులను కనుగొనడంలో సహాయపడుతుంది.2017లో మళ్లీ ఆమె మృతదేహాన్ని తవ్వారు.వారు ఆమె కాలు ఎముక, దంతాలకు అనేక పరీక్షలు చేశారు.DNA నుంచి కొన్ని ఆధారాలు దొరుకుతాయని వారు ఆశించారు.కానీ పరీక్షలు పెద్దగా సహాయం చేయలేదు.అప్పుడు ఇగ్గనైట్ డీఎన్ఏ అనే ప్రైవేట్ సంస్థ సహాయం అందించింది.
ఈ సంస్థ వంశపారంపర్య పరీక్ష అనే ప్రత్యేక రకమైన డీఎన్ఏ పరీక్షను చేశారు.ఈ పరీక్షలో ఒక వ్యక్తి డీఎన్ఏను పోల్చడం ద్వారా వారి బంధువులను కనుగొనవచ్చు.
అలా వారు ఆమె బయోలాజికల్ ఫాదర్‌ను కనిపెట్టారు.అతడి పేరు రాబర్ట్ బోవర్స్ అని తెలుసుకున్నారు.దాని తర్వాత ఆమె తల్లి, ఇద్దరు అత్తలను కూడా కనుగొన్నారు, కానీ వారు ఆల్రెడీ చనిపోయారు.జనవరిలో, వారు రాబర్ట్ బోవర్స్ నుంచి డీఎన్ఏ నమూనాను తీసుకున్నారు.
అతనే తబేతా తండ్రి అని నిర్ధారించారు.తబేతా అసలు పేరు తబేతా స్లెయిన్ అని ఆమె బంధువు పోలీసులకు చెప్పింది.
తబేతా 1987లో జెర్రీ ముర్లిన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, కానీ వారు 1989లో విడిపోయారట.తాబేతాను జెర్రీ ముర్లిన్ హత్య చేసినట్లు భావించడం లేదని పోలీసులు గురువారం తెలిపారు.
ఇంకా ఇతర నిందితుల కోసం వెతుకుతున్నారు.ప్రస్తుతం ఈమె కేసు స్థానికంగా సంచలనంగా మారింది.