యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ పట్టణంలో వేసవి ప్రారంభంలోనే తీవ్ర నీటి కొరత వేధిస్తుంది.ఈ ఏడాది వానలు సరిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడగంటి వేసవి ప్రారంభంలోనే నీటి కొరత ఏర్పడడంతో నల్లాల ద్వారా అందించే నీటిని తగిస్తున్నారు.
గతంలో వారానికి రెండు మూడు సార్లు నీటిని సప్లై చేయగా ఇప్పుడు రెండు వారాలకు ఒకసారి కూడా సరిగ్గా నీళ్లు పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కొంతమంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు.ఒక్కో ట్యాంకర్ కు రూ.400 నుంచి రూ.600 వరకు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుందని,ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.కాగా కిరాయి ఇళ్లలో ఉండే వారి పరిస్థితి మరి ఇబ్బందికరంగా ఉంది.
నీళ్లు కావాలంటే వాటర్ ట్యాంకర్ కు డబ్బులు చెల్లించాలని ఇంటి ఓనర్లు షరతులు పెడుతున్నారు.ఇప్పటికే ఇంటి కిరాయికి ఇబ్బంది పడుతున్న మాకు నీటి కొనుగోలు మరింత భారం అవుతుందని అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.వారానికి ఒకసారి కూడా సరిగ్గా రావడం లేదని లక్కారం కాలనీకి చెందిన విజయలక్ష్మి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఏరియాకు నీళ్లు వస్తలేవు,గతంలో వారానికి ఒకటి రెండు సార్లు నీళ్లు పెట్టేవాళ్ళు.ఇప్పుడు రెండు వారాలకు ఒక్కసారి పెడుతున్నారు.అది కూడా కొద్దిసేపే వస్తున్నాయి.ఎటు సరిపోవడం లేదు.
అధికారులు చర్యలు చేపట్టాలి.లేకుంటే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు.