రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.సైకో లవర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడిపై సెక్షన్ 302, 201, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.అనంతరం ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడించారు.
ప్రేమ వ్యవహారంలోనే నవీన్ ను హత్య చేసినట్లు నిందితుడు హరిహరకృష్ణ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.నవీన్, హరకృష్ణలు ఇంటర్ కలిసి చదువుకున్నారన్నారు.
హరిహరకృష్ణ ప్రేమించిన అమ్మాయిని నవీన్ లవ్ చేశాడని, ఆ అమ్మాయి కూడా నవీన్ తో క్లోజ్ ఉండటం తట్టుకోలేక హత్య చేసినట్లు తెలిపారు.మూడు నెలలకు ముందే హత్యకు నిందితుడు ప్లాన్ చేశాడని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఈనెల 17న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నవీన్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు.చంపిన అనంతరం నవీన్ ప్రైవేట్ భాగాలు, గుండె, తల, వేళ్లు, చేతులు వేరుచేసినట్లు నిందితుడు తెలిపాడని పోలీసులు ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు.