బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకోవడం సులువు కాదు.స్టార్స్ అయిన ఎంతోమంది సెలబ్రిటీల వెనుక ఊహించని స్థాయిలో కష్టం ఉంటుంది.
కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలు యశ్ ఏ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే యశ్ తండ్రి బస్ డ్రైవర్ అనే సంగతి తెలిసిందే.
యశ్( yash ) ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తండ్రి కష్టం ఎంతో ఉంది.
దర్శకధీరుడు రాజమౌళి( Rajamouli ) ఒక సందర్భంలో మాట్లాడుతూ యశ్ తండ్రి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.
యశ్ సూపర్ స్టార్ అయినా యశ్ తండ్రి ఇప్పటికీ బస్ డ్రైవర్ గా చేస్తున్నారని ఆయన తెలిపారు.యశ్ నేను ఇంత సంపాదించాను కదా.నాకింత పేరొచ్చింది కదా.నువ్వు మానేయొచ్చు కదా అని చెబితే తండ్రి వెంటనే నేను బస్ డ్రైవర్ కావడం వల్లే నిన్ను సూపర్ స్టార్ ను చేశా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా అని చెప్పాడని అదీ ఆయన గొప్పదనం అని జక్కన్న చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో యశ్ కంటే యశ్ తండ్రి సూపర్ స్టార్ అని అనిపించిందని రాజమౌళి కామెంట్లు చేశారు.యశ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.యశ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

యశ్ టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.యశ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.యశ్ విభిన్నమైన కథలను ఎంచుకుని మరింత సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.యశ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.