ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే టాప్-10 ట్రైన్స్ ఇవే..

హై-స్పీడ్ రైళ్ల టెక్నాలజీ ఇటీవలి సంవత్సరాలలో చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ సాధించింది.ఈ టెక్నాలజీ సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ మార్గాలను అందించడం ద్వారా రవాణాను విప్లవాత్మకంగా మార్చింది.

 Top 10 Fastest Trains Of The World Details, High-speed Trains, Top Speed, Transp-TeluguStop.com

ప్రస్తుతం ప్రపంచంలో అనేక రైళ్లు చాలా వేగంతో దూసుకెళ్తున్నాయి.వాటిలో టాప్ 10( TOP 10 Fastest Trains ) వేగవంతమైన రైళ్ల గురించి, వాటి స్పీడ్ గురించి తెలుసుకుందాం.

1.షాంఘై మాగ్లేవ్ (చైనా):

షాంఘై మాగ్లేవ్( Shangai Maglev ) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, ఇది 267 mph (431 km/h) వేగంతో దూసుకుపోతుంది.ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ చాలా సాఫ్ట్ అండ్ శబ్దం లేని రైడ్‌ను అందిస్తుంది.

2.Fuxing Hao CR400AF/BF (చైనా):

ఫక్సింగ్ హాఓ CR400 సిరీస్ బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైలు మార్గంలో 249 mph (400 km/h) వేగాన్ని అందుకుంటుంది.ఇది అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన భద్రతా వ్యవస్థలను కలిగి ఉంది.

Telugu Edge, Speed Trains, Maglev Train, Shangaimaglev, Shinkansen, Top Trains,

3.హార్మొనీ CRH380A (చైనా):

ట్రైన్లలో మరొక చైనీస్ అద్భుతం హార్మొనీ CRH380A. ఇది 236 mph (380 km/h) గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.దీని ఏరోడైనమిక్ డిజైన్, శక్తి-సమర్థవంతమైన సాంకేతికతల వల్ల ఇది సుదూర ప్రయాణాలకు ఉత్తమంగా నిలుస్తుంది.

4.AGV ఇటలో (ఇటలీ):

ఇటలీలో నడుస్తున్న ఫాస్టెస్ట్ ట్రైన్ AGV ఇటలో గరిష్ఠంగా 224 mph (360 km/h) వేగాన్ని అందుకోగలదు.ఈ రైలు ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

Telugu Edge, Speed Trains, Maglev Train, Shangaimaglev, Shinkansen, Top Trains,

5.సిమెన్స్ వెలారో E/AVS 103 (స్పెయిన్):

స్పెయిన్‌లో “AVE S-103” అని పిలిచే సిమెన్స్ వెలారో E గరిష్ఠంగా 217 mph (350 km/h) వేగంతో ప్రయాణిస్తుంది.ఇది అధునాతన సేఫ్టీ సిస్టమ్స్‌తో వస్తుంది.

6.E5 సిరీస్ షింకన్‌సెన్ హయబుసా (జపాన్):

E5 సిరీస్ షింకన్‌సెన్ హయబుసా జపాన్‌లోని షింకన్‌సెన్ లైన్‌లో 200 mph (320 km/h) గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.

Telugu Edge, Speed Trains, Maglev Train, Shangaimaglev, Shinkansen, Top Trains,

7.యూరోస్టర్ e320 (ఇంటర్నేషనల్):

యూరోస్టర్ e320 ట్రైన్ లండన్‌ను యూరప్‌లోని నగరాలతో కలుపుతుంది.ఇది గరిష్ఠంగా 200 mph (320 km/h) వేగంతో ప్రయాణిస్తుంది.

8.TGV డ్యూప్లెక్స్ (ఫ్రాన్స్):

TGV డ్యూప్లెక్స్ 199 mph (320 km/h) గరిష్ఠ వేగంతో నడుస్తుంది.దీని డబుల్ డెక్కర్ డిజైన్ అధిక వేగాన్ని కొనసాగిస్తూ ఎక్కువ సీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

Telugu Edge, Speed Trains, Maglev Train, Shangaimaglev, Shinkansen, Top Trains,

9.Alstom Avelia AGV (ఫ్రాన్స్):

Alstom Avelia AGV 198 mph (318 km/h) వరకు వేగాన్ని అందుకోగలదు.దీని తేలికైన నిర్మాణం, ఆప్టిమైజ్డ్‌ ఏరోడైనమిక్స్ దాని అద్భుతమైన వేగానికి దోహదం చేస్తాయి.

10.టాల్గో 350 (స్పెయిన్):

“పాటో” (డక్) అని కూడా పిలిచే టాల్గో 350, మాడ్రిడ్-బార్సిలోనా లైన్‌లో 186 mph (300 km/h) గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.దీని వినూత్న టిల్టింగ్ టెక్నాలజీ వంపు ఉన్న ట్రాక్‌లపై వేగాన్ని పెంచడానికి అనుమతిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube