వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు జనసేన పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు.తాను నిర్వహించిన సర్వేలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రఘురామ జనసేనకు ఎన్ని వస్తాయో మాత్రం చెప్పలేదు.
మేటర్ ఏంటంటే… ఈ మధ్య ఒక ప్రత్యేక యాప్ ద్వారా రఘురామ రాజు ఏపీలోని అన్నీ నియోజకవర్గాల్లో సర్వే చేయించారట.ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో ప్రజాభిప్రాయం తీసుకున్నారట.
తన సర్వేలో టీడీపీకి 90 సీట్లు వస్తాయని తేలిందని ఆయనే చెప్పారు.అయితే రాజుగారి సర్వే ప్రకారం టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని తేల్చేశారు.
అయితే రఘురామ సర్వే కాబట్టి ఎవరు కూడా వైసీపీ గెలుస్తుందని ఓటెయ్యరు.ఓకే ఇంతవరకు కరెక్టే అనుకుందాం.
మరి అధికారపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? అనేది సర్వేలో ఎందుకు తేల్చలేదు.అనేది ప్రశ్న….పోనీ వైసీపీ సంగతి వదిలేసినా.జనసేనకు ఎన్నిసీట్లు వస్తాయనే విషయాన్ని మాత్రం చెప్పాలి కదా.మరి ఎందుకు చెప్పలేదనే ప్రశ్న రావడం కామన్.
చేరబోయే పార్టీ గురించి చెప్పాలి కదా.?
చాలాకాలంగా రఘురామరాజు చెబుతున్న మాటేంటంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 అసెంబ్లీ సీట్లకు మించిరావని….వైసీపీ ఆయన అభిప్రాయమే కానీ.ప్రజల అభిప్రాయం కాదన్నది తెలిసిందే.కానీ ప్రత్యేక యాప్ సర్వేలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుందనే విషయాన్ని ఎందుకు చెప్పలేదో అర్థం కావటం లేదన్నది వాదన.సరే జగన్ అంటే మండిపోతున్న ఆయన వైసీపీ సీట్లను బయట పెట్టలేదనే అనుకుందాం.
మరి వచ్చే ఎన్నికల్లో రఘురామ పోటీచేద్దామని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న జనసేనకైనా ఎన్నిసీట్లు వస్తాయో చెప్పాలి కదా అంటున్నారు.

అంతే కాకుండా జాతీయ మీడియా సంస్ధల సర్వే వివరాలను నమ్ముకుంటే జగన్ కు దెబ్బపడటం ఖాయమని హెచ్చరించారు.కానీ తను చేయించిన సర్వేలు ఎలా నమ్మాలో చెప్పలేదు.మరి జాతీయ మీడియా సర్వేలను కాకుండా తాను నిర్వహించిన సర్వేనే వాస్తవమని ఎవరు అనుకుంటారు.? జనాలు రాఘురామ సర్వేను ఎలా నమ్మేది.అయినా ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుందో తేల్చేటప్పుడు ప్రధాన పార్టీలన్నింటికి ఎలా స్పందన వచ్చిందో చెప్పాలి కానీ.
ఒక టీడీపీకే ఇన్ని సీట్లు అని చెప్పేసి వదిలేస్తే ఎలా అంటున్నారు.