నీవు అధికారంలో ఉన్నప్పుడు మా గ్రామంలోని మట్టి అంతా రైల్వేకు ఇతర అవసరాలకు అమ్ముకున్న నువ్వు ఈరోజు పంచాయతీ తీర్మానం తో గ్రామ ప్రజలకు జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల కు ,రోడ్లకు చెరువు పూడిక తీసి మట్టి తోలుకుంటూ ఉంటే నీకెందుకు కడుపు మంట అని నిలదీశారు.గంటకు పైగా కదలనీయకుండా నిలబెట్టరు.
శేకూరు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను ఏ వ్యక్తిని అడిగినా నువ్వు నీ తమ్ముడు ఇక్కడి మట్టి ని ఏవిధంగా తోలు కున్నావో చెబుతారని వారు పేర్కొన్నారు. జై జగనన్న జై కిలారి అంటూ నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
తాము న్యాయబద్ధంగా పంచాయతీ తీర్మానం తో గ్రామంలోని మట్టిని మన గ్రామ అవసరాలకు వాడుకుంటు ఉంటే నరేంద్ర ఎవరు అడగడానికి అంటూ నిలదీశారు.వారి నుండి తప్పించుకోవటానికి చేసిన నరేంద్ర ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసుల రంగప్రవేశంతో నరేంద్ర కుమార్ బయటపడ్డారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇన్నాళ్లు తెదేపా అధికారంలో ఉండగా ఇక్కడ అంతా వారి జేబులు నింపుకున్న తేదేపా నాయకులు
ఇప్పుడు దళిత మహిళ సర్పంచ్ అవ్వడం వారికి ఇష్టంలేక, అగ్రవర్ణాల కే పట్టం కట్టే తెదేపా నాయకులు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు అందజేసిన ఇళ్ల స్థలాలకు మెరక తోలుకుంటే ఎందుకు కడుపులో మంట అని నిలదీశారు.మట్టిని మేము ఎవరికీ అమ్ముకోవడం లేదని ఒక్క చిన్న రాయి కూడా ఇక్కడి నుండి బయటి గ్రామాలకు వెళ్లడం లేదని గ్రామంలో ఉన్న మట్టిని గ్రామానికి వాడుకుంటే వారికి ఎందుకు బాధ అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు.