ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ( Revanth reddy ) కాంగ్రెస్ టీపిసిసి అధ్యక్షుడు అయ్యాడో అప్పటినుండి కాంగ్రెస్లో ఏదో తెలియని కొత్త జోష్ మొదలయ్యింది.కార్యకర్తలలో తన ప్రసంగాలతో జోష్ నింపి కాంగ్రెస్ ని తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
అయితే ఈయనపై ఎంతోమంది సొంత పార్టీ నేతలే కుట్రలు పన్నినప్పటికీ వాటన్నింటిని తిప్పికొడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల పెట్టిన వైఎస్ఆర్టిపి ( YSRTP ) పార్టీ విలీనం అవుతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించినప్పటికీ షర్మిల పార్టీ విలీనం చేయడంలో కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారని, ఆమె పార్టీని మన పార్టీలో విలీనం చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు అని, ఫలితంగా మనకు ఓట్లు తక్కువ పడే అవకాశం ఉంది అని, అందుకే ఆమె రాక మనకు వద్దు అంటూ కొంతమంది అడ్డు చెప్పారట.
అయితే ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఉన్నారని షర్మిల తెలుసుకొని ఎలాగైనా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తుందట.ఇప్పటికే రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ( Kodangal ) నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్టులో పేరు ఖరారు అయింది.అయితే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.ఇక ఈసారి పిసిసి చీఫ్ అయ్యాక కొడంగల్ లో వరుస సభలు పెట్టి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపి తన కేడర్ ని బలపరుచుకున్నారు.
అయితే షర్మిల ( Sharmila ) రేవంత్ కి చెక్ పెట్టాలని కొడంగల్ లో తన పార్టీ అభ్యర్థిగా తన భర్త అనిల్ ని నిలబెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కువగా క్రిస్టియన్స్ అలాగే వైయస్సార్ అభిమానులు ఉన్నారు.అయితే ఆ నియోజకవర్గంలో తన భర్తను నిలబెడితే క్రిస్టియన్స్ అలాగే వైయస్సార్ ఓట్లు రేవంత్ రెడ్డికి పడవు.దాంతో రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ పడుతుందని చూస్తుందట.
కానీ అసలు విషయం ఏమిటంటే.అక్కడ రేవంత్ కి కూడా మంచి క్యాడర్ ఉంది.
ఇక షర్మిల భర్త అనిల్ ( Anil ) అక్కడ అభ్యర్థిగా నిలబడితే ఇటు కాంగ్రెస్ కి అటు వైఎస్ఆర్టీపి పార్టీకి మధ్య ఓట్లు చీలిపోయి చివరికి ఆ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు.ఇలా రేవంత్ రెడ్డి పై కోపంతో షర్మిల బిఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చినట్లే అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.