ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం అందరిపై పడింది.ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల పై ఎక్కువనే చెప్పవచ్చు.
రెండేళ్ల కిందట కరోనా సమయంలో సినిమాలకు దూరంగా ఉండటంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు.ఇక అభిమానులు కూడా తమ అభిమాన నటులతో బాగా ముచ్చట్లు పెట్టడం మొదలు పెట్టారు.
అలా తమ అభిమాన నటుల అభిరుచులను తెలుసుకుంటున్నారు.ఇక ఈ మధ్య యూట్యూబ్ లో ప్రతి ఒక్కరూ ఛానల్ క్రియేట్ చేసుకుని హోమ్ టూర్ లను, ఇతర వీడియోలను బాగా పంచుకుంటున్నారు.
తాజాగా ఓ బుల్లితెర నటి కూడా ఖరీదైన గిఫ్ట్ కొనడంతో దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇంతకూ ఆమె ఎవరో కాదు బుల్లితెర నటి నవీన.
ఈమె తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి అనే చెప్పాలి.ఎన్నో సీరియల్స్ లో నెగటివ్ పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఎప్పటి నుంచో బుల్లితెరపైనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.అలా ప్రస్తుతం బుల్లితెరపై సీనియర్ నటి గా నిలిచింది.
ప్రస్తుతం పలు సీరియల్స్ లో బాగా బిజీగా ఉంది.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.ఇక ఈమెకు యూట్యూబ్ లో కూడా తన పేరు మీద ఛానెల్ వుంది.
ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.అందులో తను మాట్లాడే మాటలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీని కూడా పరిచయం చేసింది నవీన.ఆమెకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే తను ఇటీవలే కొత్త ఇల్లును నిర్మించుకోగా దానికి సంబంధించిన వీడియో మొత్తాన్ని తన ఫాలోవర్స్ కు పంచుకుంది.అందులో తాను లక్ష రూపాయల చీర ను కొనుగోలు చేసి బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
లక్ష రూపాయల చీర కట్టుకోవాలనేది తన కోరిక అని ఆ కోరిక తీరిందని తెలిపింది.ఇక తాజాగా మరో వీడియో షేర్ చేసుకుంది.ఇక తనది 15వ పెళ్లిరోజు అని తెలిపింది.దాంతో తన భర్తకు ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చింది.ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో కాదు బీఎండబ్ల్యూ కారు. ఇక ఆ వీడియోలో తాను సెకండ్ హ్యాండ్ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశానని తెలిపింది.
ఇప్పటివరకు సన్ రూఫ్ ఉన్న కారు లేదని.ఈ కారుకు పైన ఓపెన్ ఉందని తెలిపింది.ఇక తమ పెళ్లి రోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులో కేక్ కట్ చేసి బాగా సందడి చేసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా తన ఫాలోవర్స్ తెగ లైకులు కొడుతున్నారు.
కొందరు కామెంట్లు పెడుతున్నారు.