ప్రస్తుతం సొంత సినిమాలు కాకుండా రీమేక్ సినిమాలు బాగా వస్తున్నాయి.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో విడుదలైన సినిమాలకు రీమేక్ చేస్తూ మంచి సక్సెస్ లు అందుకున్నారు.
ఇక తెలుగు ఇండస్ట్రీ ఇతర భాషలలో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను రీమేక్ చేస్తున్నారు.
ఇక ఇతర భాష వాళ్ళు కూడా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు.
అలా కొన్ని కొన్ని సమయాల్లో మంచి సక్సెస్ లో అందుకోగా మరికొన్ని సమయాల్లో అంతగా గుర్తింపు రాలేకపోయాయి.చాలా వరకు రీమేక్ సినిమాలలో కొందరు దర్శకులు కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు.
దానివల్ల ఒరిజినల్ మూవీ కంటే రీమేక్ మూవీలు మరింత హిట్ అవుతూ ఉంటాయి.చాలా వరకు రీమేక్ సినిమాలను చేయటానికి స్టార్ హీరోలు మాత్రమే ముందుకు వస్తూ ఉంటారు.
అయితే రీమేక్ సినిమాలు చేయటం కేవలం ఇప్పుడే కాదు.అప్పట్లో కూడా చాలా వరకు చాలా రీమేక్ సినిమాలు వచ్చాయి.
అది కూడా ఒకప్పటి స్టార్ హీరోలే రీమేక్ సినిమాలు చేశారు.ఒకటి రెండు సినిమాలు కూడా కాదు.ఏకంగా పదికి పైగా సినిమాలలో నటించారు.ఇక ఒక స్టార్ హీరో మాత్రం ఏకంగా 50 రీమేక్ సినిమాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇంతకు ఆయన ఎవరో కాదు సీనియర్ ఎన్టీఆర్.సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మర్చిపోలేని గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయే ఉన్నాడు.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన దాదాపు 50 రీమేక్ సినిమాలలో కూడా నటించాడట.
రీమేక్ సినిమాలు అయినా సరే అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయట.అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఆయనను దాటిన వారు లేరని చెప్పవచ్చు.ఇక ఈయన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈయన కూడా ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక ఈయన దాదాపు 42 రీమేక్ సినిమాలలో నటించాడట.
ఇక సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన ఇటీవలే ఈ లోకాన్ని వదిలిపెట్టిన సంగతి తెలిసిందే.
ఈయన కూడా దాదాపు 25 రీమేక్ సినిమాలు చేశాడట.
సూపర్ స్టార్ కృష్ణ కూడా నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈయన కేవలం 11 రీమేక్ సినిమాలు చేశాడట.ఇక వెంకటేష్ 25 రీమేక్ సినిమాలు, చిరంజీవి 17, బాలకృష్ణ 12, నాగార్జున 12, పవన్ కళ్యాణ్ 10 రీమేక్ సినిమాలలో చేశారు.
ఇక ఇప్పుడు కూడా వీరు రీమేక్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.ఇక ముందు ముందు ఈ హీరోలు ఇంకెన్ని రీమేక్ సినిమాలలో చేస్తారో చూడాలి.