మెగాస్టార్ చిరంజీవి మరో సారి ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తుంది.తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో నిన్న సినిమా యొక్క సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.
గాడ్ ఫాదర్ సినిమా కు చాలా మంది స్క్రిప్ట్ వర్క్ లో సహాయం చేయడం వల్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుందని.ఆచార్య సినిమాకు ఒకే ఒక్కరు వర్క్ చేయడం వల్ల సరైన ఫలితం రాలేదు అన్నట్లుగా అర్థం వచ్చేలా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే పలు సందర్భాల్లో కొరటాల శివ పై మెగాస్టార్ చిరంజీవి విమర్శలు చేయడం జరిగింది.

ఆచార్య సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన కొరటాల శివ ఫ్లాప్ కి పూర్తిగా బాధ్యత వహించాడని, ఆయన చెప్పినట్లుగా మాత్రమే నేను, రాంచరణ్ నటించినట్లుగా పేర్కొన్నాడు.ఇప్పుడు పూర్తిగా కొరటాల శివ నిర్ణయాలు తీసుకున్నాడని.ఇతరుల యొక్క నిర్ణయాలు పట్టించుకోకుండా తానే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరించడం వల్ల సినిమా ఫలితం తారుమారు అన్నట్లుగా మారిందని మెగాస్టార్ చిరంజీవి అర్థం వచ్చేలా మాట్లాడి మరోసారి కొరటాల శివ గురించి చర్చనీయాంశం అయ్యేలా చేశాడు.
ఇక కొరటాల శివ తదుపరి సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ తో ఇప్పటికే సినిమా మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా ఆచార్య ఫలితం కారణంగానే ఇప్పటి వరకు ఆ సినిమా పట్టాలెక్క లేదు.ఇక మరో వైపు చిరంజీవి వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు.
ఆ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.చిరంజీవి వచ్చే సంక్రాంతికి వాల్తేరు వీరన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
సమ్మర్ లో భోళా శంకర్ సినిమా విడుదల కాబోతుంది.







