కీలక ఘట్టం పూర్తి.. డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని స్వీకరించిన కమలా హారిస్

నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ ప్రక్రియలో ఆమె కీలక ఘట్టం పూర్తి చేశారు.

 Senator Kamala Harris Accepts Vp Nomination At The Democratic National Conventio-TeluguStop.com

డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆమె స్వీకరించారు.డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ల సమక్షంలో కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నామినేట్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మన విషాదాలను, బాధలను రాజకీయ ఆయుధాలుగా మలచుకున్న ట్రంప్‌ను ఓడించాలని కమల పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల్లో జో బిడెన్‌ను గెలిపించాలని ఆమె కోరారు.బిడెన్ దేశాధ్యక్షుడైతే, దేశ ప్రజలందరినీ ఆయన ఒక్క తాటిపైకి తీసుకొస్తారని కమలా ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ నాయకత్వ వైఫల్యం.ప్రజల ప్రాణాలను, జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిందని ఆమె మండిపడ్డారు.

తన తల్లి నేర్పిన విలువలకు, బిడెన్ విజన్‌కు కట్టుబడి ఉంటానని కమలా హారిస్ ట్వీట్ చేశారు.

Telugu America, Kamala Harris, Kamalaharris-

ఇదే సమావేశంలో ఒబామా మాట్లాడుతూ… శ్వేత సౌధ ఉద్యోగాన్ని ట్రంప్ సీరియస్‌గా చేస్తారని భావించామని, కానీ ఆయన పాలన నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఒబామా ఆరోపించారు.ట్రంప్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టకు భంగం కలగిందని, మన ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా జో బిడెన్‌ను డెమొక్రాట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.77 ఏళ్ల జో బిడెన్ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube