విజయశాంతి పెళ్లి వెనక రహస్యం..శ్రీనివాస్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే హీరోలా హావ జోరుగా నడుస్తుంటుంది.అలాంటి సందర్భాల్లో హీరోలా అందరిలో అప్పుడు హిట్స్ ఎక్కువ గా చిరంజీవికి ఉండేవి.

 Secret Behind Vijayashanthi Marriage With Srinivas,vijashyanthi,balakrishna,srinivas,tollywood,chiranjeevi,sarilaru Neekavvaru,bjp Party,karthvyam Movie-TeluguStop.com

అందుకే 90వ దశకం లో చిరంజీవి టాప్ హీరోగా కొనసాగారు అయితే హీరోల్లో టాప్ హీరో ఉన్నట్టే హీరోయిన్స్ లో కూడా టాప్ హీరోయిన్స్ ఉంటారు కదా విజయశాంతి 90 s లో నెంబర్1 హీరోయిన్ గా ఉండేది.విజయశాంతి చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున ,వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితో సినిమాలు చేసారు.

విజయశాంతి బాలకృష్ణ తో ఎక్కువ సినిమాలు చేసింది ముద్దుల కృష్ణయ్య , అపూర్వ సహోదరులు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది అలాగే విజయశాంతి చిరంజీవి తో గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది.అయితే వెంకటేష్ తో సూర్య IPS , నాగార్జున తో జానకి రాముడు లాంటి సినిమాలు చేసింది.

 Secret Behind Vijayashanthi Marriage With Srinivas,vijashyanthi,balakrishna,srinivas,tollywood,chiranjeevi,sarilaru Neekavvaru,bjp Party,karthvyam Movie-విజయశాంతి పెళ్లి వెనక రహస్యం..శ్రీనివాస్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదంత ఒక ఎత్తు అయితే ఆవిడా చేసిన కర్తవ్యం సినిమా ఒక ఎత్తు అప్పుడు ఈ సినిమా చాల థియేటర్లలో 100 రోజులు ఆడింది.దీని తర్వాత దాసరి గారి డైరెక్షన్ లో వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమా తో విజయశాంతికి ఒక పెద్ద హీరో కి ఎలగైతే స్టార్ స్టేటస్ వస్తుంది విజయశాంతి కి కూడా అలంటి ఇమేజ్ వచ్చింది.

ఒక గిరిజన బిడ్డ దొరలా అధికారానికి ఎలా బలి అయిందో సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించారు దాసరి గారు ఆ గిరిజన బిడ్డగా విజయశాంతి యాక్టింగ్ సూపర్ అని చాలామంది మెచ్చుకున్నారు.ఈ సినిమా తర్వాత చాలామంది డైరెక్టర్లు విజయశాంతి తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ప్లాన్.

అయితే విజయశాంతి హీరోయిన్ గా బాలయ్య బాబు తో ఎక్కువ సినిమాలు చేయడం వాళ్ళ బాలయ్య కి తనకి మధ్య ఏదో సంబంధం ఉందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.బాలయ్య విజయశాంతి ని పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా చాలా వచ్చాయి కానీ అప్పట్లో ఈ విషయం పై బాలయ్య బాబు గాని విజయశాంతి గాని ఎవరు స్పందించలేదు.తర్వాత విజయశాంతి శ్రీనివాస ప్రసాద్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి.నిజానికి శ్రీనివాస్ బాలకృష్ణ ఇద్దరు మంచి స్నేహితులు.విజయశాంతి తో హీరోయిన్ గా సినిమాలు తీసాడు.ఆ క్రమంలోనే వీరు ఇద్దరు ప్రేమలో పడ్డారు.

ఇక బాలకృష కి కూడా విజయశాంతి అంటే మంచి అభిప్రాయం ఉండటంతో ఇద్దరికీ పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించాడు.ఆలా వీరి పెళ్లి జరిగింది.

తర్వాత విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు.

రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించి తన గ్రెస్ ఇంకా తగ్గలేదని మళ్ళి ఇంకోసారి ప్రూవ్ చేసారు విజయశాంతి గారు.

మహేష్ బాబు హీరోగా ఉండడం వల్లే ఈ సరిలేరు నీకెవ్వరూ అనే మూవీ ని చేశాను అని విజయశాంతి గారు అన్నారు.విజయశాంతి కృష్ణ తో కూడా మంచి సినిమాలు చేసింది ఆయనతో కూడా ఆమె కి ఒక మంచి అనుబంధం ఉంది.

ఆమె ఆయనతో కూడా మంచి సినిమాలు చేసారు.అయితే కృష్ణ గారి అబ్బాయి ఆయిన మహేష్ తో కూడా మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నపుడు ఒక సినిమా చేసారు విజయశాంతి గారు.

అయితే ఈ సినిమా కథ చెప్పి ఒప్పించడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి చాల కష్టపడాల్సి వచ్చిందట.అయితే ఇంతకు ముందు రాజాదిగ్రేట్ మూవీ లో రవితేజ తల్లిగా రాధిక వేసిన క్యారెక్టర్ ని విజయశాంతికి చెపితే ఏదో కారణం చెప్పి తప్పించుకుంది

అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టద్దు అనుకోని అనిల్ వచ్చి కథ చెప్పి ఒప్పించి మొత్తానికి విజయశాంతి గారితో క్యారెక్టర్ చేయించారు.అయితే విజయశాంతి ప్రస్తుతం బీజేపీ పార్టీ లో ఉన్నారు తాను సినిమాల పరంగా సక్సెస్ అయ్యారు, పొలిటికల్ గా కూడా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.హీరోల డామినేషన్ నడుస్తున్న రోజుల్లో ఫస్ట్ టైం తాను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి హీరోయిన్స్ కూడా హీరోలా కంటే తక్కువ కాదు అని నిరూపించారు.

విజయశాంతి గారి స్టైల్ ఆ టీవీ వేరేలా ఉండేది.విజయశాంతి ని ముద్దుగా సౌత్ లేడీ అమితాబ్ అని పిలిచేవారు.ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న సూర్య మూవీస్ అధినేత.A.M రత్నం ఒకపుడు విజయశాంతి మేకప్ మాన్ గా చేసినవాడే అయన ఇప్పుడు ఇండియా లోనే టాప్ ప్రొడ్యూసర్.ఇప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ లా మూవీకి కూడా ప్రొడ్యూసర్ అతనే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వంటి హీరో తో ఖుషీ లాంటి సినిమా చేసాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube