టాలీవుడ్ నటి సమంత ( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించడంతో సినిమాలో పరంగా నాగచైతన్య( Nagachaitanya ) సమంత మధ్య విభేదాలు రావడం అనంతరం విడాకులు తీసుకొని విడిపోవడం వంటివి జరిగాయి.ఇక విడాకుల తర్వాత సమంత ఎప్పటిలాగే సినిమాలపై ఫోకస్ పెట్టారు కానీ ఈమెను మయోసైటిసిస్ అనే వ్యాధి వెంటాడింది.
ఇక ఈ వ్యాధి బారిన పడినటువంటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు కూడా దూరమయ్యారు.ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్నటువంటి ఈమె ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకొని ఈ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడిప్పుడే ఈమె ఈ వ్యాధి నుంచి కోరుకుంటున్నారని తెలుస్తోంది.ఇక త్వరలోనే సినిమాలలోకి తిరిగి రావడానికి కూడా ఈమె సిద్ధమయ్యారంటూ ఇటీవల సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.సమంత పుస్తకాలను చదువుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ.చిన్నప్పుడు నేను నా సిలబస్ కి మించిన పుస్తకాలను చదివానుకుంటాను.ఏ సబ్జెక్ట్‌లో అయినా పరిశోధన చేయడం, లీనమవడం నాకు చాలా ఇష్టం.ఇప్పుడు, నేను మళ్లీ చదువుతున్నాను.
చాలా సంవత్సరాల తర్వాత నా మనసు ఉప్పొంగుతోంది.నా నోట్‌బుక్‌లు నిండాయి.
త్వరలోనే మీతో పంచుకుంటాను.అంటూ రాసుకొచ్చింది.
ఇక సమంత ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యం పై పాడ్ కాస్ట్ సిద్ధం చేసానని త్వరలోనే విడుదల చేయబోతున్నామంటూ ఇటీవల సమంత తెలిపిన సంగతి తెలిసిందే.ఇక ఇది కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.ఇకపై సమంత ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగిపోతున్నారు అనే విషయం మనకు తెలిసిందే.ఈమె నిర్మాణ సంస్థను అధికారకంగా తెలియజేయడమే కాకుండా అద్భుతమైన కథ ఉంటే సంప్రదించాలని కూడా ఈమె వెల్లడించారు.