ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కౌంటర్ ఇచ్చారు.ఏపీ రాజకీయాలపై షర్మిలకు కనీస అవగాహన కూడా లేదని తెలిపారు.
రాజకీయ పార్టీ అంటే కుటుంబంలో పదవులు పెంచుకోవడమా అని సజ్జల ప్రశ్నించారు.పదవులు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టా అని నిలదీశారు.
ఓదార్ప యాత్ర వద్దన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అన్న సజ్జల కేసులు పెట్టి ఇబ్బంది గురి చేయలేదా అన్న విషయాన్ని చెప్పాలన్నారు.
గతంలో సోనియా( Sonia Gandhi )ను కలిసినప్పుడు షర్మిల కూడా ఉన్నారని తెలిపారు.ఆ సమయంలో ఏం జరిగిందో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు.జగన్( YS Jagan Mohan Reddy ) తన సొంత కష్టం మీద ఎదిగారని స్పష్టం చేశారు.
దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలను తాము గౌరవిస్తామని చెప్పారు.జగన్ అనేక కష్టాలు పడ్డారన్న ఆయన అక్రమ కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్నారన్నారు.తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ను తిట్టారు.తిరిగి ఆమె అదేపార్టీలో చేరారని విమర్శించారు.
ఈ క్రమంలోనే షర్మిల మాట్లాడిన ప్రతీ మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.