సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు ఒక సినిమా చేసేటప్పుడు ఈ సినిమా చేయాలా వద్దా అని ఒకటి కి పదిసార్లు ఆలోచించుకొని డిసైడ్ అవుతారు.అయితే ఇలాంటి సందర్భంలోనే హీరోలకి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది.
అది ఏంటి అంటే బాగా తెలిసిన ఫ్రెండ్స్ గాని లేదా ఇండస్ట్రీలో ఇంతకు ముందు రెండు,మూడు హిట్లు కొట్టి ఇప్పుడు ఫ్లాప్ లో ఉన్న పెద్ద డైరెక్టర్లు గాని కుట్ర హీరోల దగ్గరికి వచ్చి కథలు చెప్పడం జరుగుతుంది.కొన్నిసార్లు ఆ కథలను నచ్చకపోయినా కూడా వాళ్లతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఆ స్టోరీ వినాల్సి వస్తుంది అలా కొన్ని సందర్భాల్లో సినిమా స్టోరీ నచ్చకపోయినా కూడా ఆ డైరక్టర్ల మీద ఉన్న ఇష్టంతో సినిమాలు చేయాల్సి వస్తుంది.
అలా ఇండస్ట్రీలో సినిమాలు చేసి ప్లాపులను ముట కట్టుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.అలాంటి వాళ్లలో సాయిధరమ్ తేజ( Sai dharam tej ) ఒకడు.
ఈయన ఇంతకుముందు చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సక్సెస్ అందుకున్న వివి వినాయక్ ( V V Vinayak )ఆ తర్వాత సినిమా సాయి దరం తేజ్ తో చేయాలని ఇంటెలిజెంట్( Inttelligent ) అనే ఒక కథ ని రెడీ చేసుకున్నాడు.
అయితే ఆ కథ సాయి ధరమ్ తేజ్ కి పెద్ద గా నచ్చలేదట కానీ వినాయక్ మీద ఉన్న నమ్మకంతో ఇంతకుముందు ఆయనకున్న హిట్స్ తో సరే అని మొహమాటానికి పోయి ఈ సినిమా చేశాడు.ఈ సినిమా భారీ ప్లాప్ అయింది ఇక అలాగే గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ సినిమా( Winner ) విషయం లో కూడా ఇలానే జరిగింది.
ఇక ఈ రెండు సినిమాలే కాకుండా డైరెక్టర్ కరుణాకర్ డైరెక్షన్ లో వచ్చిన తేజ్ సినిమా కూడా ప్లాప్ అయింది ఇక దాంతో ఇంకోసారి ఎప్పుడూ మొహమాటానికి వెళ్లి సినిమాలు చేయకూడదని ఆయన డిసైడ్ అయ్యాడు.ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గానే సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష సినిమాతో ఒక మంచి సక్సెస్ ని కూడా అందుకున్నాడు.
మొత్తానికైతే ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నాడు…