బాలయ్య, చిరంజీవి లకు షాక్ ఇచ్చిన సాయి పల్లవి...

సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో కానీ హీరోయిన్ గానీ స్టార్ స్టేటస్ పొందుతున్నారు అంటే దానికి ముందు వాళ్ళు పడిన కష్టం చాలా ఎక్కువ అనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న అతి తక్కువ మంది మంచి హీరోయిన్స్ లలో సాయి పల్లవి ( Sai pallavi )ఒకరు కొందరు రెమ్యున్ రేషన్ ఎక్కువ గా ఇస్తే క్యారెక్టర్ ఏంటో తెలియకపోయిన సినిమాకి కమిట్ అవుతారు కానీ ఈ న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి అందుకు పూర్తిగా విరుద్దం… ఆమె సినిమాలో త‌న పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త చూసుకుంటుంది.అస‌లు ఆ పాత్ర త‌న‌కు సూట్ అవుతుందా? లేదా?.ప్రేక్ష‌కులు ఆధ‌రిస్తారా? లేదా?.వంటి లెక్క‌లు మాత్ర‌మే వేసుకుంటుంది.

 Sai Pallavi Shocked Balayya And Chiranjeevi, Sai Pallavi, Veera Simha Reddy, Nan-TeluguStop.com

అందుకే సాయి ప‌ల్ల‌వి త‌న కెరీర్ లో చేసిన ప్ర‌తి పాత్రకు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Sai Pallavi, Tollywood-Movie

ఒక‌వేళ త‌న పాత్ర న‌చ్చ‌క‌పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా రిజెక్ట్ చేసేస్తుంది.ఇలా సాయి ప‌ల్ల‌వి గ‌తంలో చాలా చిత్రాల‌ను వ‌దులుకుంది.ఈ లిస్ట్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కూడా ఉందండోయ్‌.

 Sai Pallavi Shocked Balayya And Chiranjeevi, Sai Pallavi, Veera Simha Reddy, Nan-TeluguStop.com

ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు.వీర సింహా రెడ్డి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.

ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి పోషించిన బాల‌య్య చెల్లెలు క్యారెక్ట‌ర్ కోసం మొద‌ట సాయి ప‌ల్ల‌విని అనుకున్నార‌ట‌.

Telugu Bhola Shankar, Chiranjeevi, Sai Pallavi, Tollywood-Movie

కానీ, సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ కు మంచి ప్రాధాన్య‌త ఉన్నా కూడా సాయి ప‌ల్ల‌వి మాత్రం ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసింద‌ట‌.ఇటువంటి నెగ‌టివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ త‌న‌కు అస్స‌లు సూట్ కాద‌ని భావించి ఆమె వ‌దులుకుంద‌ట‌.దాంతో వ‌ర‌ల‌క్ష్మిని ఎంపిక చేశారు.

ఆమె తన న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించింది.బాల‌య్య‌కు ధీటుగా న‌టించి మెప్పించింది.

ఏదేమైనా సాయి ప‌ల్ల‌వి ఈ రోల్ ను వ‌దులుకోవ‌డమే మంచిదైంది.ఒక‌వేళ చేసుంటే ఖ‌చ్చితంగా ప‌రువు పోయేది.

ఎందుకంటే, ఇటువంటి క్యారెక్ట‌ర్స్ ఆమెకు అస్స‌లు సూట్ కావు.ఈ విష‌యం తెలుసు కాబ‌ట్టే సున్నితంగా సాయి ప‌ల్ల‌వి వీర సింహా రెడ్డిని వ‌దులుకుంది…ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి( Chiranjeevi ) చేస్తున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar Movie )లో కూడా ఈమెని చెల్లే పాత్ర కోసం అడిగారు కానీ ఆమె ఆ పాత్ర ని చేయను అని చెప్పి రిజక్ట్ చేసింది…ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలకి షాక్ ఇచ్చిన హీరోయిన్ గా సాయి పల్లవి టాలీవుడ్ లో చాలా స్పెషల్ అని అనిపించుకుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube