'రిపబ్లిక్‌' తో రాబోతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తో దేవ కట్టా ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా పొలిటికల్‌ డ్రామా కమ్ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 Sai Dharam Tej Republic Poster Release, Sai Dharam Rej, Aishwarya Rajesh, Deva K-TeluguStop.com

ఇదే సమయంలో సినిమా లో సాయి ధరమ్‌ తేజ్ పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.రేపు రిపబ్లిక్ డే సందర్బంగా సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేశారు.

సినిమాకు ‘రిపబ్లిక్‌’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.ప్రజాస్వామ్యంను కాపాడే మూడు వ్యవస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి.

దేశంలో కొన్ని సంఘటనల్లో ప్రజాస్వామ్యం ఎలా ఖునీ చేయబడుతుంది అంటూ రిపబ్లిక్ మూవీలో దేవా కట్టా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.రిపబ్లిక్ మూవీ షూటింగ్‌ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.

సినిమా షూటింగ్‌ ను సమ్మర్ లోనే పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దేవా కట్టా దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందించేందుకు విభిన్నమైన స్క్రిప్ట్ ను రూపొందించాడు.సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా సాయి ధరమ్‌ తేజ్ ఒక మంచి సినిమా చేశాడు అనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తం అవ్వడం ఖాయం.

దేవా కట్టా దర్శకత్వంలో సినిమా అంటే హీరోలకు మంచి ఇమేజ్ వస్తుంది.ఆ ఇమేజ్ ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కు కూడా వచ్చే అవకాశం ఉందని టైటిల్ ను చూస్తుంటే అనిపిస్తుంది.

తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందని సందేశాత్మక సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.సాయి ధరమ్‌ తేజ్‌ కు జోడీ గా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈమె నటిగా ఇప్పటికే ఓ రేంజ్ లో సక్సెస్ లను దక్కించుకుంది.అందుకే ఈ సినిమా తో మరోసారి ఆమె తెలుగు వారికి దగ్గర అవ్వడం ఖాయం అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ అప్ డేట్‌ తో పాటు విడుదల తేదీ విషయమై శివరాత్రికి ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube