గండం గట్టెక్కి ఆర్సీబీ గెలిచింది.. కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!

తాజాగా బెంగళూరు – రాజస్థాన్( Royal Challengers Bangalore ) మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో స్పెషల్.బెంగుళూరు జట్టు ఏడు పరుగుల తెరతో విజయం సాధించింది.

 Royal Challengers Bangalore Beat Rajasthan Royals  ,rajasthan Royals , Yashasvi-TeluguStop.com

దీంతో అభిమానులు సంతోషంతో సందడి చేశారు.ఇక విరాట్ కోహ్లీ ఆనందానికి హద్దులే లేవు.

గ్రౌండ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ భార్య అనుష్కకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ తెగ సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పరుగులు చేయకుండానే డక్ అవుట్ తో వెలు తిరిగాడు.బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది.190 పరుగుల లక్ష్య చేదనకు దిగిన రాజస్థాన్ జట్టును సమర్ధంగా ఎదుర్కొంటూ ఒక్కొక్క వికెట్ తీస్తున్న క్రమంలో 14 ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన నాలుగో బంతికి జైస్వాల్( Yashasvi Jaiswal ) లాంగాన్ భారీ షార్ట్ ఆడేందుకు ప్రయత్నించి విరాట్ కోహ్లీకి ( Virat Kohli )క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆ సందర్భంలో విరాట్ కోహ్లీ సంతోషం పట్టలేక భార్య అనుష్క కి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ తెగ ఎంజాయ్ చేశాడు.అనుష్క కూడా భర్త సంతోషాన్ని చూస్తూ తెగ సంబరపడింది.భార్యాభర్తల సంబరాలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

190 పరుగుల లక్ష్య చేదనలో రాజస్థాన్ జట్టు 182 పరుగులు చేసి, 7 ఏడు పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. జైస్వాల్ 47, దేవ్ దత్ పడిక్కళ్ 52( Yashasvi Jaiswal ) పరుగులతో చెలరేగిన కూడా ఫలితం లేకుండా పోయింది.మధ్య ఓవర్లలో పరుగులు చేయడంలో వేగం తగ్గడంతో ఒత్తిడి పెరిగి రాజస్థాన్ జట్టు వికెట్లు కోల్పోతూ చివరి వరకు పోరాడి ఓడింది.

ఏది ఏమైనా ఏప్రిల్ 23 అంటే గండంగా భావించే బెంగుళూరు జట్టు ఎట్టకేలకు గండం గట్టెక్కి, విజయం ఖాతాలో పడడంతో జట్టుతో పాటు అభిమానులు కూడా పట్టలేని సంతోషంలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube