నువ్వు మీసాలు తిప్పితే భయపడేవాడు ఎవడు లేడిక్కడ.. బాలయ్యపై రోజా కామెంట్స్ వైరల్!

Roja Comments Goes Viral About Balakrishna Details Here Goes Viral In Social Media , Roja ,balakrishna , YCP Party , Tdp ,Ambati Rambabu , Viral

ఏపీ అసెంబ్లీ సమావేశాలలో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Balakrishna ) మీసం తిప్పడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.బాలయ్య మీసం తిప్పడం గురించి వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేయగా ఆ సెటైర్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Roja Comments Goes Viral About Balakrishna Details Here Goes Viral In Social Me-TeluguStop.com

అయితే బాలయ్యకు పలు సినిమాలలో జోడీగా నటించిన రోజా బాలయ్య మీసాలు తిప్పడం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ ! నాది తెలుగు గడ్డ ! అంటూ అంబటి రాంబాబు( Ambati Rambabu ) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.అంబటి కామెంట్ కు కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.రోజా మాట్లాడుతూ బాలయ్య హిందూపురం నియోజకవర్గం గురించి పట్టించుకోకుండా ఎప్పుడూ షూటింగ్ లకు వెళతారని చెప్పుకొచ్చారు.

సినిమా షూటింగ్ ఫంక్షన్లలో బాలయ్య( Balakrishna )ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలని చెబుతాడని కడుపు చేయాలని చెబుతాడని ఆడవాళ్లు అంటే గౌరవం లేకుండా బాలయ్య మాట్లాడతాడని రోజా కామెంట్లు చేశారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈరోజు బాలయ్య అసెంబ్లీకి వచ్చి మీసం మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని రోజా కామెంట్లు చేశారు.

రోజా ( Roja )వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.రోజా కామెంట్లపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.బాలయ్య, పవన్ ను రోజా పదేపదే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హద్దులు దాటి రోజా విమర్శలు చేయడం సరికాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube