వరుణ్ తేజ్, లావణ్య ( Varun Tej, Lavanya ) పెళ్లికి చాలామంది గెస్ట్ లు వచ్చి వారిని ఆశీర్వదించారు.అయితే వీరు పెళ్లికి ముందే కొన్ని ప్రి వెడ్డింగ్ షూటింగ్స్ అలాగే బ్యాచిలర్ పార్టీలు చేసుకున్నారు.
అలా అల్లు అర్జున్ కూడా కాబోయే భార్య భర్తలయిన వరుణ్ తేజ్ లావణ్యలకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.అయితే వరుణ్ తేజ్ లావణ్యలకు ఇచ్చిన పార్టీలో వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్( Sai dharam tej ) , నితిన్,నితిన్ భార్య షాలిని,అల్లు శిరీష్ లు పాల్గొన్నారు.
కానీ వీరి ఫ్యామిలీకి సంబంధం లేని హీరోయిన్ రీతూ వర్మ కూడా పార్టీలో పాల్గొంది.అయితే హీరో నితిన్ తన భార్యతో కలిసి వచ్చారు.
ఇక నితిన్ కి వరుణ్ తేజ్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడం వల్లే వీరు ఈ పార్టీకి వచ్చారు.
కానీ ఎలాంటి ఫ్రెండ్షిప్ లేని రీతూ వర్మ ( Ritu varma ) అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి ఎందుకు గెస్ట్ గా వచ్చింది అని చాలామంది ఎన్నో రకాల అనుమానాలు తెర మీద వినిపించారు.ఇంకొంతమంది అయితే రీతూ వర్మ కూడా మెగా ఇంటికి కోడలు కాబోతుంది కావచ్చు అందుకే ఆమె ఆ ఫ్యామిలీలో ఒకరిగా పార్టీకి వచ్చింది అని కొంతమంది కామెంట్లు చేస్తే ఇంకొక మందేమో గతంలో లావణ్య త్రిపాఠి కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్లలో అప్పుడప్పుడు కనిపించేది.
అలా మెగా ఇంటికి కోడలుగా వెళ్ళింది.ఇక రీతూ వర్మ కూడా నెక్స్ట్ మెగా ఇంటికి కోడలు కాబోతుంది కావచ్చు అని ఇలా ఎన్నో వార్తలు వైరల్ చేశారు.అంతేకాదా సాయి ధరమ్ తేజ్ రీతూ వర్మ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి.
కానీ అసలు విషయం ఏమిటో హీరో వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) స్పష్టం చేశారు.వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమా నవంబర్ 24 న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే తాజాగా ఒక ప్రమోషన్ లో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ వరుణ్ తేజ్ లావణ్య వెడ్డింగ్ పార్టీలో పాల్గొనడం పై క్లారిటీ ఇచ్చారు.
రీతూ వర్మ లావణ్య త్రిపాటికి మంచి స్నేహితురాలు.ఈ కారణంతోనే ఆమె పార్టీకి వచ్చింది.
అంతేకానీ మీరు అనుకుంటున్నట్లు వేరే మాత్రం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.దీంతో ఇప్పటివరకు రీతూ వర్మ పై వచ్చిన వార్తలన్నింటికి పులిస్టాప్ పడినట్లు అయింది
.